spot_img
Homeఎంటర్టైన్మెంట్Devara Song : ఎన్టీఆర్ దేవర పాటకు హీరోయిన్ నయనతార పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో...

Devara Song : ఎన్టీఆర్ దేవర పాటకు హీరోయిన్ నయనతార పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి..వైరల్ అవుతున్న వీడియో!

Devara Song :  గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఎన్టీఆర్(Junior Ntr) ‘దేవర'(Devara Movie) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఎన్టీఆర్ స్టామినా తో పాటు, సంగీత దర్శకుడు అనిరుద్ అందించిన బ్లాక్ బస్టర్ ఆల్బం కూడా ఒక కారణం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ సినిమాలోని పాటలు అన్ని వయస్సులకు సంబంధించిన వారు ఎంజాయ్ చేయడం ఈ సినిమాకే జరిగింది. యూత్ ఆడియన్స్ ‘దూకే ధైర్యమా జాగ్రత్త’ అనే పాట ఎంత కనెక్ట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే విధంగా మాస్ ఆడియన్స్ కి ‘జాతర’ సాంగ్ ఒక రేంజ్ లో నచ్చేసింది. ఇక క్లాస్ ఆడియన్స్ అయితే ‘చుట్టమల్లే’ సాంగ్ కి ఎంత కనెక్ట్ అయ్యారో మనం కళ్లారా చూసాము.

విడుదల రోజు థియేటర్స్ అన్ని ఈ పాటకు కన్సర్ట్స్ లాగా మారిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే కేవలం పాటల కోసమే ఈ సినిమాకి వెళ్లిన ఆడియన్స్ లక్షల్లో ఉంటారేమో అని విశ్లేషకుల అభిప్రాయం. ఈ సినిమాలోని పాటలు ఆడియన్స్ కి ఎంతలా నచ్చిందో చెప్పడానికి ఒక ఉదాహరణ మీ ముందుకు తీసుకొస్తున్నాము. రీసెంట్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanathara) తన భర్త, పిల్లలతో కలిసి కారులో వెకేషన్ ట్రిప్ కి బయలుదేరుతుంది. కార్ లో ఉన్న సమయంలో ‘చుట్టమల్లే’ సాంగ్ తమిళ వెర్షన్ ప్లే అవ్వడం, దానికి నయనతార పిల్లలు వైబ్ అవుతూ ఎంజాయ్ చేయడం చూసేందుకు చాలా క్యూట్ గా అనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ సినిమాలోని పాటలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసాయి అనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.

ఈమధ్య కాలం లో ఒక సినిమా ఫలితాన్ని, కేవలం పాటలు నిర్ణయిస్తున్నాయి అని చెప్తే మీరెవరైనా నమ్ముతారా..?, కానీ అది పచ్చి నిజం, నమ్మక తప్పదు.ఉదాహరణకి ఈ ఏడాది విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘తండేల్’ చిత్రాలను తీసుకుందాం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో గోదారి గట్టు మీద సాంగ్ ఎంత పెద్ద అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్స్ లో చూడాలి అని ఫ్యామిలీ ఆడియన్స్ మొండిపట్టు పట్టేలా చేసింది. సినిమా విడుదల తర్వాత మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, 300 కోట్లు రాబట్టింది, అంత బానే ఉంది, కానీ విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ఆ రేంజ్ లో జరగడానికి కారణం మాత్రం ఈ చిత్రంలోని పాటలే. ఇక రీసెంట్ గా విడుదలైన ‘తండేల్’ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. కానీ ఆడియో బ్లాక్ బస్టర్ అవ్వడంతో కేవలం పాటల కోసం థియేటర్స్ కి వెళ్లారు ఆడియన్స్. రాబోయే పాన్ ఇండియన్ చిత్రాలకు కూడా ఇప్పుడు కచ్చితంగా ఒక పాట క్లిక్ అవ్వడం ముఖ్యం.

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Oktelugu Epaper