kishkindhapuri : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సైతం సూపర్ సక్సెస్ లను సాధించడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలన్ని వరుసగా డిజాస్టర్ల బాట పడుతుండటంతో ఇప్పుడు కొత్తగా ‘కిష్కింధపురి’ అనే సినిమాతో హార్రర్ థ్రిల్లర్ జోనర్ ని ట్రై చేశాడు. ఈ సినిమాతో మంచి సక్సెస్ ని సాధించాడు… ఇక ఇప్పటి వరకు ఆయన చేయనటువంటి జానర్లో సినిమాను ట్రై చేసి సక్సెస్ ని సాధించడంతో ఆయన చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాలో విలన్ గా నటించిన వ్యక్తి ఎవరు అంటూ చాలామంది అతని గురించి తెలుసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. నిజానికి డిగ్లామర్ రోల్ అవ్వడంతో అలాగే వికలాంగుడి పాత్ర పోషించడంతో అతను ఎవరు అనేది ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు. అతను ఎవరు అంటే శాండీ మాస్టర్…
ఇక ‘లియో’ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన ‘కొత్తలోక’ సినిమాలో కూడా విలన్ గా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు కిష్కింధపురి సినిమాలో కూడా నటించింది తనే కావడం విశేషం… ఇక ఈ సినిమాలో మొత్తానికైతే తన పాత్ర హైలెట్ గా నిలిచింది.
అయితే శాండీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే మంచి అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగా వచ్చిందే ‘కిష్కింధపురి’…ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. కాబట్టి అతనికి తెలుగులో మరిన్ని ఛాన్సులు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.
మరి వాటిని వాడుకొని తనను తాను మంచి నటుడిగా నిరూపించుకుంటాడా? కొరియోగ్రాఫర్ గా సైడ్ కి వెళ్లిపోతాడా అనేది తెలియాల్సి ఉంది…ఇక లేదంటే రెండిటిని సమానంగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళే కెపాసిటీ తనకుందని ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే కిష్కింధపురి సినిమాలో విలన్ గా నటించి మెప్పించడం అనేది మామూలు విషయం కాదు. ఒక డిఫరెంట్ పాత్రలో ఆయన కనిపించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు…