Vijayashanti: క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని కమిట్ అయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉందని.. ఆ పాత్ర ఎన్టీఆర్ కి సవతి తల్లి పాత్ర అని.. కాగా ఆ పాత్రలో విజయశాంతి నటించబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే, మొదట ఆ పాత్రలో ఒకప్పటి మరో స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ను తీసుకోవాలని కొరటాల ప్లాన్ చేశాడట. కానీ చివరకు విజయశాంతిని ఫైనల్ చేశారు.

Also Read: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం… కరోనాతో స్టార్ డైరెక్టర్ మృతి
ఇక ఈ పాత్ర సినిమాలోనే కీలకం అట. ఇప్పటికే ఎన్టీఆర్ కి సినిమాలో బాబాయ్ పాత్ర ఉందని.. ఆ పాత్ర కూడా వెరీ ఎమోషనల్ గా ఉంటుందని.. అందుకే ఆ పాత్రలో హీరో రాజశేఖర్ ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా కూడా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఒప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఆ విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అయితే.. సినిమా మార్కెట్ కి ఇంకా బాగా ఉపయోగపడుతుంది అని కొరటాల కూడా ఫీల్ అవుతున్నాడు.

కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే సమ్మర్ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అన్నట్టు ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్స్ కూడా వేసారు. పైగా జూబ్లీహిల్స్ లోని ఎన్టీఆర్ ఇంటి పక్కనే ఆ పెద్ద సెట్ వేశారు. సినిమాలో ఎక్కువ భాగం ఈ సెట్ లోనే ఉంటుందని.. ఎన్టీఆర్ కి చాలా టైం కలిసివస్తుందని కొరటాల శివనే స్వయంగా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ఎన్టీఆర్ కి సవతి తల్లిగా విజయశాంతి నటిస్తే.. కాంబినేషన్ అదిరిపోతుంది.
Also Read: ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఉద్యోగులు.. దెబ్బకు అత్యవసర కేబినెట్ భేటీ పెట్టిన జగన్..!