Bigg Boss Telugu OTT: రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వేదికగా అలరిస్తోంది. కంటెస్టెంట్ల మాటలు, టాస్క్ లు, ఎలిమినేషన్ ఎపిసోడ్, కెప్టెన్సీ టాస్క్ లు రంజుగా సాగుతున్నాయి. ఎవరికి వారే రెచ్చిపోతున్నారు. కొందరు బూతులు మాట్లాడుతూ హౌస్ లో రచ్చ చేస్తున్నారు. గ్రుపులుగా మారి ఒకరిపై మరొకరు తిట్టి పోసుకుంటున్నారు. కాగా మొత్తం 17 మందిలో ముమైత్ ఖాన్, శ్రీరాపాక, సరయు, తేజస్వి, ఆర్జే చైతు, స్రవంతి.. ఈ ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ముమైత్ ఖాన్ ను ఒకసారి ఎలిమినేట్ చేసి.. వైల్డ్ కార్డ్ ద్వారా మళ్లీ హౌస్‌లోకి తీసుకుని వచ్చి.. మళ్లీ ఎలిమినేట్ చేశారు. ప్రస్తుతం హౌస్ లో ఇంకా 11 మంది కొనసాగుతున్నారు.

ఈవారం కెప్టెన్సీ టాస్క్ సిల్లీగా అనిపించింది. ఎందుకంటే సంచాలక్ గా వన్ సైడ్ గేమర్ అషురెడ్డిని పెట్టడమే కారణం. ఎంత చెత్త సంచాలక్ గా వ్యవహరించిందంటే అఖిల్ ని గెలిపించడానికి మిగతా వాళ్లందరిని తొక్కేసింది. కానీ చివరకి యాంకర్ శివనే కెప్టెన్ గా నిలిచాడు.
Also Read: RRR Actor Ajay Devgn: తప్పు చేసి జైలు పాలైన RRR నటుడు అజయ్ దేవగన్
టాస్క్ తొలి నుంచి టఫ్ ఫైట్ ఇస్తున్న అనీల్-హమీదా జంటను డిస్ క్వాలిఫై చేసి కెప్టెన్సీ కలను దూరం చేసింది. బాక్సింగ్ రింగ్ లాంటి దాంట్లో జంటల్ని పంపించి.. వాళ్ల కళ్లకి గంతలు కాళ్లకి గజ్జెలు కట్టి.. వెనుక జెండాలు కట్టారు.. కిందా మీదా పడి ఆ జెండాలను లాక్కోవాలని చెప్పడంతో పాఫం ఆ రింగ్‌లో ఉన్న అరియానా, మిత్రా శర్మలను ఫుడ్ బాల్ ఆడేశారు అనీల్, అఖిల్, శివలు. కిందా మీద పడేస్తూ తొక్కిపడేశాడు. ఒళ్లు హూనం అవుతున్నా వాళ్లని విడిచిపెట్టకుండా లాగేపడేశారు. అఖిల్ అయితే వచ్చిన వాళ్లని వచ్చినట్టుగా గుద్దిపడేశాడు.

అందరికంటే బాగా ఆడి.. ఎక్కువ జెండాలను సంపాదించిన అనీల్-హమీదాలను సిల్లీ రీజన్‌తో డిస్ క్వాలిఫై చేసి అషురెడ్డి చెత్త సంచాలక్ అనిపించుకుంది. నీకేమైనా పిచ్చిలేసిందా? అంటూ హమీదా ఎంత వారించినా అషురెడ్డి అఖిల్‌ని గెలిపించాలనే ఆత్రంతో కనిపించింది తప్పా వాళ్ల కష్టాన్ని గుర్తించలేదు. అయితే ఈ టాస్క్‌లో అనీల్-హమీదాల తరువాత ఎక్కువ జెండాలను సంపాదించిన నటరాజ్, శివ విజేతలుగా నిలిచారు.
ఫైనల్‌గా ఎత్తర జెండా టాస్క్ పూర్తయ్యేసరికి నటరాజ్, శివ, మిత్ర, మహేష్ కెప్టెన్సీపోటీదారులుగా ఎంపిక అయ్యారు. అయితే హమీదా..అనీల్‌లకు అవకాశం ఇస్తూ.. ఇద్దరిలో ఒకరు మాత్రమే కెప్టెన్ పోటీదారులయ్యే అవకాశం ఉందని.. ఆ ఒక్కరు ఎవరో నిర్ణయించుకోవాలని బిగ్ బాస్ కోరగా… ఇద్దరూ డిసైడ్ అయి అనీల్ కెప్టెన్సీ పోటీదారుడిగా ముందుకు వచ్చాడు. దీంతో నటరాజ్, శివ, మిత్ర, మహేష్, అనీల్‌లు కెప్టెన్ పోటీదారులయ్యారు.

కాగా ఈ ఐదుగురికి ర్యాప్ అండ్ రోల్ అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. చేతులు కాళ్లు కవర్స్‌తో కట్టేసి కిందపడి దొర్లుతూ గమ్యం చేరిన తరువాత లేచి నిలబడాలి. అయితే ఈ టాస్క్‌లో అందరికంటే ముందుగా నటరాజ్ మాస్టర్ గమ్యం చేరినప్పటికీ పైకి లేవలేకపోయారు. అనిల్, మహేష్ చేతులో కవర్లలో నుంచి చేతులు బయటకు వచ్చేయడంతో డిస్ క్వాలిఫై అయ్యారు. మిత్రా శర్మ కూడా పైకి లేవడానికి చాలా కష్టపడింది కానీ ఆ శక్తి చాలలేదు.

చివరికి శివ పైకి లేవడంతో ఈ టాస్క్‌లో విజేతగా నిలిచి కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. మొత్తానికి ఆరు సార్లు కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక అయిన శివ ఎట్టకేలకు కెప్టెన్ అయ్యాడు. దీంతో శివ ఫుల్ హ్యాప్పిగా నటరాజ్ మాస్టర్‌తో కలిసి చిందులేశాడు. బిందు మాధవితో కలిసి హ్యాప్పిని పంచుకున్నాడు . కెమెరా ముందుకు వచ్చి.. థాంక్యూ బిగ్ బాస్.. ఫైనల్‌గా కెప్టెన్ అయ్యా.. నాకు ఓట్లు వేసి ఆరు వారాలు హౌస్‌లో ఉంచి ఇప్పుడు కెప్టెన్‌ని కావాడానికి సహాయపడిన వారందకీ థాంక్స్ అంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే అషురెడ్డి సంచాలక్ గా చెత్త పర్మామెన్స్ ఇచ్చిందంటూ తిట్టిపోస్తున్నారు ప్రేక్షకులు.