Vijay Deverakonda Rashmika Mandanna marriage : విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) పెళ్లి జరిగి రెండు వారాలు పూర్తి అయ్యింది. కానీ సోషల్ మీడియా లో వీళ్లకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా వీళ్లకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. అయితే పెళ్లి జరిగిన తర్వాత వీళ్ళు అందరూ జంటలు లాగానే హనీమూన్ ట్రిప్ కి వెళ్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగడం లేదు. ఇద్దరు కలిసి నేడు మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే వీళ్లిద్దరు చాలా కాలం తర్వాత కలిసి హీరో హీరోయిన్లు గా జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబలి’. ‘శ్యామ్ సింగ రాయ్ ‘ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వీళ్లిద్దరి పెళ్లి జరిగిన మరుసటి రోజే , ఈ మూవీ నుండి ‘ఏందయ్యా సామీ ‘ అనే పాటకు సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా, అది బాగా వైరల్ అయ్యింది.
త్వరలోనే ఈ పాటని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే 50 శాతం కి పైగా పూర్తి అయ్యింది. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు . ఇకపోతే నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఒక భారీ సెట్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. విజయ్ దేవరకొండ , రష్మిక ఇద్దరూ కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. వీళ్లిద్దరి పై ఒక అందమైన మెలోడీ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. వారం రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ సాగనుంది. అనంతరం మూవీ షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి హనీ మూన్ ట్రిప్ కోసం విదేశాలకు వెళ్లనుంది ఈ జంట. అనంతరం తిరిగి వచ్చిన తర్వాత నాన్ స్టాప్ గా ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్స్ లో పాల్గొనబోతున్నారు.
సీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ ఇది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలు తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి చేస్తున్న సినిమా ఇది. పైగా పెళ్లి తర్వాత విడుదల అవుతున్న సినిమా కాబట్టి అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఈమధ్యనే విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమాకు కూడా ఆ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లో సూపర్ హిట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ‘గీత గోవిందం ‘ తర్వాత విజయ్ దేవరకొండ ఒక్క సరైన బ్లాక్ బస్టర్ ని కూడా అందుకోలేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కింగ్డమ్ ‘ చిత్రం కూడా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాతో కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.