Homeఆంధ్రప్రదేశ్‌Kakinada AE Nookaraju Family : మతం మార్పిడి ఒత్తిడి.. సాధిక్ ధాటి ఆ కుటుంబం...

Kakinada AE Nookaraju Family : మతం మార్పిడి ఒత్తిడి.. సాధిక్ ధాటి ఆ కుటుంబం ఆత్మార్పణం.. సంచలన నిజాలు వెలుగులోకి..

Kakinada AE Nookaraju Family : రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్య కేసులు ఊహించని మలుపు తిరిగాయి. దీనికి కారణం మతం మార్పిడి ఒత్తిడి అని పోలీసులు తేల్చారు. ఈ మేరకు కాకినాడ ఎస్పీ ధృవీకరిస్తూ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు షేక్ షాదిక్ ఖాన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ తెలిపారు. కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ […]

Kakinada AE Nookaraju Family : రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్య కేసులు ఊహించని మలుపు తిరిగాయి. దీనికి కారణం మతం మార్పిడి ఒత్తిడి అని పోలీసులు తేల్చారు. ఈ మేరకు కాకినాడ ఎస్పీ ధృవీకరిస్తూ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు షేక్ షాదిక్ ఖాన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ తెలిపారు. కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు ఆయన కుటుంబం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఈ కుటుంబం చావుకు కారణమైన రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాదిక్ ఖాన్ గత కొద్ది రోజులుగా పరారీలో ఉండగా.. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఢిల్లీలో అరెస్టు చేశారు. ఆదివారం నాటికి కాకినాడకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు.

* తీవ్ర వేధింపులు..
కాకినాడ ఎస్పీ చెప్పిన వివరాలు ప్రకారం ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్యతో సాదిక్ ఖాన్ కు పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ఆమెకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం, ప్రైవేటు ఫోటోలను ఆసరాగా చేసుకుని బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చినట్లు సౌజన్య రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా ఈ విషయం వెల్లడైనట్లు పోలీసులు ధృవీకరించారు. ఆ మనస్థాపం, మానసిక వేధింపులు తట్టుకోలేక కుటుంబమంతా అర్ధరాత్రి వేళ గోదావరి నదిలో దూకి దారుణానికి ఒడిగట్టింది. మరోవైపు సాదిక్ ఖాన్ సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి కి విషం ఇచ్చి చంపేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. నూకరాజు తో పాటు ఆయన కుమార్తె సౌజన్య సూసైడ్ నోట్లో కూడా ఈ విషయం వెల్లడైనట్లు తెలుస్తోంది.

* క్షణికావేశం వద్దు..
కాగా ఈ ఘటనపై కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాదిక్ ఖాన్ వేధింపులతోనే ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. రాజమండ్రిలో తొలుత కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నూకరాజు తో పాటు ఆయన కుమార్తె సౌజన్య స్కూటీలో సైతం సూసైడ్ నోట్లు లభ్యమయ్యాయి అని చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచామని చెప్పారు. ప్రస్తుతం రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఆయనను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు.. ఇటువంటి ఘటనలు ఎదురైనప్పుడు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ కోరారు. క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. కాగా నిందితుడు సాదిక్ ఖాన్ కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper