Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna marriage conditions: పెళ్ళికి ముందే రష్మిక కి కండీషన్స్ పెట్టిన విజయ్ దేవరకొండ...

Rashmika Mandanna marriage conditions: పెళ్ళికి ముందే రష్మిక కి కండీషన్స్ పెట్టిన విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు..అవి ఏంటంటే!

Rashmika Mandanna marriage conditions: ఇన్ని రోజులు సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యికళ్లతో ఎదురు చూసిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) వివాహం ఎల్లుండి రాజస్థాన్ లో అంగరంగ వైభవం జరగబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఈ జంట అధికారికంగా రీసెంట్ గానే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. నిన్ననే విజయ్ దేవరకొండ తన తరుపున 50 మంది అతిథులతో రాజస్థాన్ లోకి ఎంట్రీ ఇచ్చేసాడు. నేడు మెహందీ ఫంక్షన్ గ్రాండ్ గా […]

Rashmika Mandanna marriage conditions: ఇన్ని రోజులు సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యికళ్లతో ఎదురు చూసిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) వివాహం ఎల్లుండి రాజస్థాన్ లో అంగరంగ వైభవం జరగబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఈ జంట అధికారికంగా రీసెంట్ గానే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. నిన్ననే విజయ్ దేవరకొండ తన తరుపున 50 మంది అతిథులతో రాజస్థాన్ లోకి ఎంట్రీ ఇచ్చేసాడు. నేడు మెహందీ ఫంక్షన్ గ్రాండ్ గా జరగబోతుంది. సాయంత్రం జరగనున్న ఈ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు , వీడియోలు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రేపు కూడా ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన కార్యక్రమాలు జరగనుంది. ఎల్లుండి గ్రాండ్ గా కుటుంబ సభ్యులు , మిత్రుల సమక్ష్యంలో ఈ జంట పెళ్లి గ్రాండ్ గా జరగనుంది. ఇదంతా పక్కన పెడితే గతం లో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు తమ కాబోయే కోడలి గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఈ ఈవెంట్ కి యాంకర్ గా సుమ వ్యవహరించింది. ఆమె ముందుగా విజయ్ దేవరకొండ తల్లి మాధవి వద్దకు వెళ్లి ‘మీకు ఎలాంటి కోడలు కావాలని కోరుకుంటున్నారు ‘ అని అడగ్గా , అందుకు మాధవి సమాధానం చెప్తూ ‘మా అబ్బాయిని ప్రేమగా చూసుకునే అమ్మాయి వస్తే చాలు , అంతకు మించి మాకు ఎలాంటి కోరికలు లేవు. కాకపోతే ఒకే ఒక్క కండీషన్ , మా అబ్బాయి సినీ పరిశ్రమకు చెందిన వాడు , కాబట్టి అతన్ని రాబోయే అమ్మాయి అర్థం చేసుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చింది . అనంతరం విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన రావు మాట్లాడుతూ ‘పెళ్లి విషయం లో విజయ్ కి మేము పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశాము . వాడు ఏ అమ్మాయిని ఇష్టపడితే , ఆ అమ్మాయినే చేఉకోవాలని కోరుకుంటున్నాను .నాకు ఎలాంటి అభ్యంతరాలు , అంచనాలు , డిమాండ్స్ లేవు. అమ్మాయి భారతీయురాలు , మన దక్షిణ భారతదేశానికి చెందిన అమ్మాయి అయితే చాలు. కులం, మతం ఏదైనా పర్వాలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు .

సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఈ వీడియో విజయ్ దేవరకొండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించినది అయ్యుంటుంది అని అంటున్నారు ఫ్యాన్స్. ఈ వీడియో లో విజయ్ దేవరకొండ ఒక ఈవెంట్ లో పెళ్లి గురించి మాట్లాడుతూ ‘కచ్చితంగా ప్రేమ పెళ్లి నే చేసుకుంటాను. కానీ తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయిని మా పెళ్ళికి ముందే ఇష్టపడాలి’ అంటూ చెప్పుకొచ్చాడు . బాగా గమనిస్తే గత కొన్నేళ్ల నుండి రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంటుంది. దీనిని బట్టీ ఆమె తన అత్తమామలకు ఎంత నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper