Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy: బొద్దింకల కోసం ట్వీట్ చేయడం కాదు.. జన్ జీ కి...

YS Jagan Mohan Reddy: బొద్దింకల కోసం ట్వీట్ చేయడం కాదు.. జన్ జీ కి అవకాశాలివ్వాలి.. చూసి నేర్చుకో జగన్..

YS Jagan Mohan Reddy: ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో వరుసగా ఆందోళనలు జరుగుతున్నాయి. నీట్.. సర్ విధానాల మీద యువత ఉద్యమాలు చేస్తోంది. ఈ ఉద్యమం గురించి.. ఉద్యమం వెనుక ఉన్న శక్తుల గురించి.. దీని వెనుక వస్తున్న ఆరోపణల గురించి పక్కన పెడితే.. యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మాత్రం శుభ పరిణామం. అయితే ఈ ప్రశ్నించే విధానం హింసాత్మక రూపంలో ఉండకూడదు. కేవలం ఎటువంటి హింసకు అవకాశం లేకుండా మాత్రమే ఉండాలి. ఈ […]

YS Jagan Mohan Reddy: ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో వరుసగా ఆందోళనలు జరుగుతున్నాయి. నీట్.. సర్ విధానాల మీద యువత ఉద్యమాలు చేస్తోంది. ఈ ఉద్యమం గురించి.. ఉద్యమం వెనుక ఉన్న శక్తుల గురించి.. దీని వెనుక వస్తున్న ఆరోపణల గురించి పక్కన పెడితే.. యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మాత్రం శుభ పరిణామం. అయితే ఈ ప్రశ్నించే విధానం హింసాత్మక రూపంలో ఉండకూడదు. కేవలం ఎటువంటి హింసకు అవకాశం లేకుండా మాత్రమే ఉండాలి. ఈ విషయంలో బొద్దింకలు విఫలమయ్యాయి అని చెప్పవచ్చు. అయితే ఇటువంటి ఉద్యమాలను నిర్మించడంలో ప్రతిపక్ష పార్టీలు మనదేశంలో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో బొద్దింకలు చేస్తున్న ఉద్యమాన్ని హైజాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. బొద్దింకల ఉద్యమంలో కూడా తాము కూడా పాల్గొంటున్నట్టు కవరింగ్ ఇస్తున్నాయి. ఇందులో వైసిపి కూడా ఒకటి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో ప్రజాస్వామ్యం మరుగున పడిపోయింది. హింస రాజ్యమేలింది. అటువంటి పరిపాలన సాగించిన జగన్ బొద్దింకలకు సపోర్ట్ చేయడం.. పైగా ఒక ట్వీట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

వాస్తవానికి జెన్ జెడ్ సపోర్ట్ చేయడం అంటే ట్వీట్ చేయడం కాదని.. వారికి అవకాశాలు కల్పించడం అని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. మాటలు చెప్పడం కాకుండా.. చేతల్లో తమ పనితీరును చూపిస్తున్నారు. జన్ జెడ్ కు అవకాశాలు కల్పించి తమ స్థాయి ఏమిటో.. తమ కమిట్మెంట్ ఎలా ఉంటుందో నిరూపించారు టిడిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..

రాజకీయాలలో యువతకు భాగస్వామ్యం కల్పించాలని ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తారు.. ప్రతి వేదిక మీద మాట్లాడుతూనే ఉంటారు. అయితే మిగతా నాయకుల మాదిరిగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా.. ఆయన చేతల్లో చూపిస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఇచ్చిన మాట ప్రకారం నెల్లూరులోని నగర పాలక సంస్థ పరిధిలో యువతకు ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం కల్పించారు. తన నియోజకవర్గంలోని దాదాపు 55 రోజులపాటు సుమారు 20వేల మంది యువతి యువకులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. వారి ఆకాంక్షలను తెలుసుకున్నారు. దాదాపు నాలుగు కార్పొరేటర్ స్థానాలను ఎటువంటి రాజకీయ నేపథ్యంలోని విద్యావంతులైన యువ అభ్యర్థులకు ఇచ్చారు.

ఈ వినూత్న ప్రయోగం ఏపీ రాష్ట్రంలో చర్చకు దారి తీస్తోంది. శ్రీధర్ రెడ్డి ఎంపిక చేసిన డివిజన్లో బీటెక్.. ఎంబీఏ.. ఎల్.ఎల్.బి వంటి ఉన్నత విద్యను అభ్యసించి.. సామాజిక సేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్న 21 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్న యువ నాయకులను స్క్రీనింగ్ ద్వారా ఎంపిక చేశారు. వారికి ఎన్నికల్లో అవకాశం కల్పించారు. ఎటువంటి రాజకీయపరమైన అండదండ లేకపోయినప్పటికీ.. ప్రజా సమస్యల మీద అవగాహన ఉండడం.. డివిజన్ అభివృద్ధి మీద స్పష్టమైన ఆలోచన ఉన్న యువతను గుర్తించారు శ్రీధర్ రెడ్డి. వారికి బి ఫారాలు అందజేశారు. తద్వారా యువతలో సరికొత్త ఉత్సాహాన్ని ఆయన నింపారు.

శ్రీధర్ రెడ్డి ఎంపిక చేసిన వారిలో 16వ డివిజన్ నుంచి షేక్ సాజిద్.. 18వ డివిజన్ నుంచి కొమ్మిరెడ్డి ప్రవల్లిక.. 21వ డివిజన్ నుంచి పొట్లూరి అఖిల్.. 26వ డివిజన్ నుంచి వేముల కార్తీక్ కు శ్రీధర్ రెడ్డి టికెట్లు ఇచ్చారు. వీరిలో సాజిద్ సామాజిక సేవ రంగంలో ఉన్నారు. కొమిరెడ్డి ప్రవల్లిక ఉన్నత విద్యావంతురాలు. పొట్లూరి అఖిల్ స్థానిక సమస్యల మీద అవగాహన ఉన్నవాడు.. వేముల కార్తీక్ ఉన్నత విద్యావంతుడు.. ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి. ఈ నలుగురు అభ్యర్థుల వయసు 22 నుంచి 28 ఏళ్ల లోపే. వీరంతా కూడా సామాన్య కుటుంబాలనుంచి వచ్చారు. వీరి ఖర్చు.. ఎన్నికల బాధ్యత మొత్తం శ్రీధర్ రెడ్డి భుజాన వేసుకున్నారు. వీరికి టికెట్ కేటాయించే విషయంలో పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఒత్తిడి తీసుకురావడం.. ఇంకా అనేక రకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ శ్రీధర్ రెడ్డి తగ్గలేదు. ఎన్నికల ప్రచారంలో యువత కేవలం జెండాలు మోయడానికి మాత్రమే పరిమితం కాకూడదని.. చట్టసభల్లో.. స్థానిక సంస్థలకు సంబంధించిన నిర్ణయాధికారాలలో భాగస్వాములు కావాలని శ్రీధర్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు. తన నిర్ణయాన్ని చేతల్లో చేసి చూపించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper