Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: రేపే 'బిగ్ బాస్ 10' లో మిడ్ వీక్ ఎలిమినేషన్.....

Bigg Boss 10 Telugu: రేపే ‘బిగ్ బాస్ 10’ లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ అవుట్!

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ షో లో ఆడియన్స్ ఓటింగ్ కి మేకర్స్ అసలు విలువే ఇవ్వడం లేదనే వాదన సోషల్ మీడియా లో బలంగా వినిపిస్తోంది. గత సీజన్స్ లో ఆడియన్స్ ఓట్ల ద్వారానే ఎలిమినేషన్ ఉండేది. కానీ ఇప్పుడు హౌస్ మేట్స్ ఓట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండు సార్లు చరణ్ హౌస్ మేట్స్ ఓట్లతోనే బయటకు వెళ్ళాడు. ఇక ఈ వారం కూడా హౌస్ మేట్స్ ఓట్లతోనే ఒక […]

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ షో లో ఆడియన్స్ ఓటింగ్ కి మేకర్స్ అసలు విలువే ఇవ్వడం లేదనే వాదన సోషల్ మీడియా లో బలంగా వినిపిస్తోంది. గత సీజన్స్ లో ఆడియన్స్ ఓట్ల ద్వారానే ఎలిమినేషన్ ఉండేది. కానీ ఇప్పుడు హౌస్ మేట్స్ ఓట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండు సార్లు చరణ్ హౌస్ మేట్స్ ఓట్లతోనే బయటకు వెళ్ళాడు. ఇక ఈ వారం కూడా హౌస్ మేట్స్ ఓట్లతోనే ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయబోతున్నారు మేకర్స్. అది కూడా రేపు రాత్రి జరగనుంది. ప్రస్తుతం బిగ్ బాస్ టీం రెడ్ జోన్ లో రోహిత్ , శ్వేతా నాయుడు , సుధీర్, షాలిని, వంశీ, ఝాన్సీ , దక్షి, రామ కృష్ణ లను పెట్టారు. వీరిలో షాలిని , దక్షి లలో ఒకరు రేపు రాత్రి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా హౌస్ లోని కంటెస్టెంట్స్ ఓట్లతోనే అట.

అంతే కాదు రోహిత్ ని ఎలిమినేట్ చేయడం కోసం ఒక పక్క త్రిగున్ , మరో పక్క ముకేశ్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అతనికి ఎల్లో కార్డు రావడం తో , ఇంకోసారి అతన్ని రెచ్చగొడితే కచ్చితంగా రెడ్ కార్డు ఇచ్చి పంపించేస్తారు అనే ఐడియా తో ముకేశ్ , త్రిగున్ లు నామినేషన్స్ సమయం లో ఒక రేంజ్ లో రెచ్చగొడుతున్నారు. ముకేష్ గ్రూప్ చాలా పెద్దది కాబట్టి , ఒకవేళ హౌస్ మేట్స్ ఓట్లతో ఎలిమినేషన్ పెట్టాలని అనుకుంటే, వీళ్ళు రోహిత్ కి వ్యతిరేకంగా ఓట్లు వేసే అవకాశం కూస్తో లేకపోలేదు. అదే కనుక జరిగితే రేపు రోహిత్ హౌస్ నుండి బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.

మరోపక్క ఈ వారం ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ టాస్కులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్ లో అమన్ అద్భుతంగా గేమ్ ఆడి ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ గా నిలిచాడు. ఆయనతో పాటు నీతూ మాస్టర్ , దేబ్జాని వంటి వారు కూడా అత్యధిక సమయం బరువుని పెట్టుకొని నిలబడినందుకు బిగ్ బాస్ వాళ్ళిద్దరిని కూడా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం క్యాటగిరీలోకి చేర్చాడు. ఈ ముగ్గురు రాబోయే రెండు వారాలు నామినేషన్స్ నుండి తప్పించుకున్నారు. అంటే నేరుగా ఫ్యామిలీ వీక్ లోకి అడుగుపెట్టినట్టే అన్నమాట. అంతే కాదు , ఈరోజు ఎపిసోడ్ అమన్ , త్రిగున్ లకు చాలా పాజిటివ్ గా మారనుంది. ఇద్దరి గ్రాఫులు పెరిగే అవకాశాలు ఉన్నాయి , అదే సమయం లో రోహిత్ గ్రాఫ్ బాగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి , చూడాలి మరి రాబోయే రోజుల్లో ఆట ఎంత రసవత్తరంగా మారబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper