Vijay Devarakonda New Movie: వరుసగా ఫ్లాప్ సినిమాలు వస్తున్నప్పటికీ కూడా ఇసుమంత క్రేజ్ కూడా తగ్గకుండా, క్రేజీ ప్రాజెక్ట్స్ ని ఒప్పుకుంటూ ముందుకు వెళ్తున్న హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). ప్రస్తుతానికి ఈయన హీరో గా నటిస్తున్న ‘రణబలి ‘, ‘రౌడీ జనార్ధన’ చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. ఈ సినిమాలు సెట్స్ మీద ఉండగానే , మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ని ఓకే చేసాడు విజయ్ దేవరకొండ. అందులో ఒకటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ‘స్వారీ’ చిత్రం కాగా, మరొకటి ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌరవ్ తో సెమీ పీరియాడికల్ మైథలాజికల్ చిత్రం. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని కూడా విడుదల్ చేయగా , దానికి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాకు పని చేయబోయే టెక్నీషియన్స్ అందరూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నవారే.
స్టోరీ కూడా చాలా విభిన్నంగా ఉండబోతుంది అట, ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి కాన్సెప్ట్ తో ఒక్క సినిమా కూడా రాలేదని అంటున్నారు , ఆ రేంజ్ లో ఉండబోతుంది మూవీ. అయితే ఈ చిత్రం లో నటించే నటీనటులు కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఫేమ్ ని సంపాదించిన వాళ్ళే అని తెలుస్తోంది. అందులో భాగంగా ఈ చిత్రంలో హీరోయిన్ రోల్ కోసం , నేషనల్ అవార్డు విన్నర్ , బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కృతి సనన్ ని ఎంచుకున్నట్టు సమాచారం. రీసెంట్ గానే ఆ చిత్ర దర్శకుడు శౌరవ్ కృతి సనన్ ని కలిసి ఈ సినిమా స్టోరీ ని వినిపించగా, ఆమె చాలా థ్రిల్ కి గురైనట్టు తెలుస్తోంది. ఈ సినిమా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది అట. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇది కాసేపు పక్కన పెడితే ఈ చిత్రం లో నటించడం కోసం కృతి సనన్ దాదాపుగా 14 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇది ప్రస్తుతం విజయ్ దేవరకొండ తీసుకునే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఒకప్పుడు విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ భారీగానే తీసుకునేవాడు. కానీ ఈమధ్య కాలంలో ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో రెమ్యూనరేషన్ ని తగ్గించాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల్లో ఒక్కటి హిట్ అయినా రెమ్యూనరేషన్ మళ్లీ బాగా పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే కృతి సనన్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ సతీమణి తో కలిసి బాలీవుడ్ లో ‘కాక్ టైల్ 2’ అనే చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే.