spot_img
Homeఎంటర్టైన్మెంట్Raj Nidimoru: సమంత భర్త ఊర మాస్ ప్లానింగ్.. సూపర్ హీరో గా సల్మాన్ ఖాన్..

Raj Nidimoru: సమంత భర్త ఊర మాస్ ప్లానింగ్.. సూపర్ హీరో గా సల్మాన్ ఖాన్..

Raj Nidimoru: సమంత(Samantha Ruth Prabhu) రెండవ భర్త రాజ్ నిడిమోరు(Raj Nidimoru) బాలీవుడ్ లో ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ , నిర్మాత అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దేశం మొత్తం ఎంతగానో ఇష్టపడే వెబ్ సిరీస్ లలో ఒకటి ‘ది ఫ్యామిలీ మ్యాన్’. ఇప్పటి వరకు మూడు సీజన్స్ వచ్చాయి, మూడిట్లో రెండిటికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రెండవ సీజన్ లో సమంత ని ఆయన ఎంతటి క్రూరమైన విలన్ గా చూపించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సిరీస్ తో పాటు ఆయన షాహిద్ కపూర్ తో ‘ఫర్జీ’ అనే వెబ్ సిరీస్ కూడా చేసాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఇండియా లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న సిరీస్ గా నిల్చింది. అంతే కాకుండా సమంత తో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ చేసాడు, ఇది కూడా పెద్ద హిట్ అయ్యింది.

ఇలా ఇంత కాలం తన టాలెంట్ ని కేవలం ఓటీటీ ఆడియన్స్ కి మాత్రమే పరిమితం చేసిన రాజ్ & డీకే, ఇప్పుడు వెండితెర ద్వారా కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే పనిలో పడ్డాడు. అది కూడా చిన్నా చితకా హీరోతో ఆయన వెండితెర అరంగేట్రం చేయడం లేదు , ఏకంగా బాలీవుడ్ బడా సూపర్ స్టార్స్ లో ఒకరైన సల్మాన్ ఖాన్ తో తన మొదటి చిత్రం చేస్తున్నాడు. సల్మాన్ ని ఇందులో ఆయన ఒక సూపర్ హీరో గా చూపించబోతున్నాడు అట. రీసెంట్ గానే సల్మాన్ ని కలిసి ఈ సూపర్ హీరో స్టోరీ ని వినిపించగా, ఆయనకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది , వెంటనే షూటింగ్ ని మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పినట్టు తెలుస్తోంది. అక్టోబర్ నెల నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఈ చిత్రం తో పాటు సల్మాన్ ఖాన్ రీసెంట్ గానే దిల్ రాజు ప్రొడక్షన్ లో వంశీ పైడిపల్లి తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు రీసెంట్ గానే మొదలయ్యాయి. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రాజ్ & డీకే లతో సూపర్ హీరో స్టోరీ సినిమాని మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారట. ఇందులో హీరోయిన్ గా సమంత నే నటించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి సల్మాన్ వరుస ఫ్లాప్స్ లో ఉన్నాడు. కరోనా లాక్ డౌన్ తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు రాబోయే చిత్రాలతో భారీ లెవెల్లో కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు , మరి ఆయన ఆకాంక్ష నెరవేరుద్ధో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper