
Heroine Photo : హీరోయిన్ విద్యాబాలన్ ఒక్క ఫోటోతో సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపారు. ఆమె ఏకంగా న్యూడ్ ఫోటో షూట్ చేశారు. ఒంటిపై నూలు పోగు లేకుండా న్యూస్ పేపర్ అడ్డుపెట్టుకొని కుర్చీలో కూర్చున్నారు. ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబూ రత్నాని ఈ ఫోటో తీశారు. 44 ఏళ్ల విద్యాబాలన్ చేసిన సాహసం చూసి జనాల మైండ్ బ్లాక్ అవుతుంది. అదే సమయంలో ఈ వయసులో నీకు అవసరమా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక విద్యాబాలన్ న్యూడ్ ఫోటో వైరల్ గా మారింది. గతంలో కియారా అద్వానీని సైతం డబూ రత్నాని ఇదే తరహాలో ప్రజెంట్ చేశారు. ఆమె నగ్నంగా ఒక ఆకు వెనుక దాక్కునట్లు ఫోటో తీశారు.
కియారా అద్వానీ ఫోటో కూడా ఇలానే నెటిజెన్స్ ని ఆకర్షించింది. అలాగే విమర్శల పాలైంది. ఇక విద్యాబాలన్ విషయానికి వస్తే… ముంబైలో పుట్టి పెరిగిన విద్యా బాలన్ తమిళ బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. హీరోయిన్ ప్రియమణి ఈమెకు కజిన్ అవుతుంది. 2003లో ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. బెంగాలీ చిత్రంతో హీరోయిన్ గా మారారు. అనంతరం మణిరత్నం తెరకెక్కించిన గురు చిత్రంలో కీలక రోల్ చేశారు.
2011లో విడుదలైన డర్టీ పిక్చర్ విద్యా బాలన్ కెరీర్, ఇమేజ్ మార్చేసింది. సౌత్ ఇండియా సెన్సేషన్ తెలుగు అమ్మాయి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా డర్టీ పిక్చర్ మూవీ తెరకెక్కింది. విద్యాబాలన్ సిల్క్ స్మిత రోల్ చేశారు. అప్పటి వరకు ఆమెకున్న ఇమేజ్ రీత్యా బోల్డ్ రోల్ చేయడం విశేషంగా మారింది. అప్పట్లో డర్టీ పిక్చర్ ఇండియా వైడ్ మారుమ్రోగిన చిత్రం. సిల్క్ స్మిత కుటుంబ సభ్యులు టైటిల్ పై అభ్యంతరం తెలిపారు. విద్యాబాలన్ స్కిన్ షో చేయడంతో పాటు సిల్క్ పాత్రలో జీవించారు. కమర్షియల్ గా కూడా విజయం సాధించిన డర్టీ పిక్చర్… విద్యా బాలన్ ని బాగా పాపులర్ చేసింది.
2019లో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు మూవీతో ఆమె తెలుగులో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన ఆ చిత్రంలో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ రోల్ చేయగా… ఆయన భార్య బసవతారకంగా విద్యాబాలన్ నటించారు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు డిజాస్టర్ కావడంతో మరలా ఆమె తెలుగులో చిత్రాలు చేయలేదు. డర్టీ పిక్చర్ విడుదలైన నెక్స్ట్ ఇయర్ ఆమె నిర్మాత ఆదిత్య రాయ్ కపూర్ ని వివాహం చేసుకున్నారు. కెరీర్ బిగినింగ్ లో ఆమె అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అలాగే ఆమె పలుమార్లు బాడీ షేమింగ్ కి గురయ్యారు.