Homeఎంటర్టైన్మెంట్Venkatesh And Anil Ravipudi New Film: సీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న వెంకటేష్,...

Venkatesh And Anil Ravipudi New Film: సీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న వెంకటేష్, అనిల్ రావిపూడి కొత్త చిత్రం..టైటిల్ ఏంటంటే!

Venkatesh and Anil Ravipudi New Film: ప్రతీ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద చుట్టం చూపుతో రావడం, రికార్డ్స్ అన్నిటిని మడతపెట్టి సంచిలో వేసుకొని వెళ్లడం, డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కి చాలా సాధారణమైన విషయం గా తయారైంది. బ్యాక్ టు బ్యాక్ రెండు సంక్రాంతులు రెండు సార్లు 300 కోట్లను కొల్లగొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్స్ ని అందుకున్న అనిల్ రావిపూడి, తన తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) తో […]

Venkatesh and Anil Ravipudi New Film: ప్రతీ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద చుట్టం చూపుతో రావడం, రికార్డ్స్ అన్నిటిని మడతపెట్టి సంచిలో వేసుకొని వెళ్లడం, డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కి చాలా సాధారణమైన విషయం గా తయారైంది. బ్యాక్ టు బ్యాక్ రెండు సంక్రాంతులు రెండు సార్లు 300 కోట్లను కొల్లగొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్స్ ని అందుకున్న అనిల్ రావిపూడి, తన తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్టే. ఇందులో విక్టరీ వెంకటేష్ తో పాటు మరో హీరో కి కూడా స్కోప్ ఉంది. ఈ పాత్ర కోసం ఫహాద్ ఫాజిల్ ని సంప్రదించారట మేకర్స్. ఆయన కూడా ఈ చిత్రం లో నటించేందుకు సానుకూలంగా రెస్పాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ ని తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు అనిల్ రావిపూడి.

అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ దాదాపుగా లాక్ అయిపోయినట్టు తెలుస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుంది అట. ఈ చిత్రానికి ‘శ్రీమతి లతా వెంకటరెడ్డి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. చూసేందుకు టైటిల్ చాలా విచిత్రంగా ఉంది కదూ. అనిల్ రావిపూడి సినిమాల టైటిల్స్ అన్నీఈ అలాగే ఉంటాయి మరి. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం లో ఇద్దరి ఆడవాళ్ళ మధ్యలో ఎలా అయితే వెంకటేష్ నలిగిపోయాడో, ఈ చిత్రం లో పెళ్ళాం, చెల్లి, బామ్మర్ది మధ్యలో హీరో అలా నలిగిపోతాడట. ఫుల్ కామెడీ తో పాటు, సెంటిమెంట్ సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో భారీగా ఉంటాయని టాక్. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు నెల లోపు పూర్తి కాబోతుంది. ఆ తర్వాత వెంటనే అనిల్ రావిపూడి తో చేయబోయే ఈ చిత్రం మొదలు కాబోతుంది.

ఎట్టి పరిస్థితిలోనూ సంక్రాంతికే ఈ చిత్రాన్ని విడుదల చేసే టార్గెట్ తో పని చేయబోతున్నట్టు సమాచారం. ఇకపోతే ఇందులో విక్టరీ వెంకటేష్ కి జోడిగా పూజా హెగ్డే, లేదా కీర్తి సురేష్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అదే విధంగా ఫహాద్ ఫాజిల్ కి జంటగా కన్నడ బ్యూటీ ఆశికా రంగనాథ్ ని తీసుకోబోతున్నట్టు సమాచారం. ఈమె మన టాలీవుడ్ లోకి ‘నా సామిరంగా’ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘విశ్వంభర’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి చిత్రాల్లో నటించింది. వీటిల్లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది. కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు కానీ, ఈమెకు మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది. మరి ఈ సినిమాలో ఆమె నటించబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper