Homeఎంటర్టైన్మెంట్VD14 Movie Movie Poster: విజయ్ దేవరకొండ న్యూ మూవీ పోస్టర్ 'శపించబడిన భూమి పురాణం'...

VD14 Movie Movie Poster: విజయ్ దేవరకొండ న్యూ మూవీ పోస్టర్ ‘శపించబడిన భూమి పురాణం’ ఇదేంటి ఇలా ఉంది…

VD14 Movie Movie Poster: విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా VD14 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు… ఆ పోస్టర్లో టాప్ యాంగిల్ షాట్ లో నేల మొత్తం బీటలు వారి ఉంది. అందులో ఒక వరుసలో కొంతమంది జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక దాంతో పాటుగా ‘ది లెజెండ్ ఆఫ్ ది క్రూజ్డ్ ల్యాండ్’ అంటూ రాసి ఉంది…అంటే ‘శపించబడిన భూమి పురాణం’ అనే ఒక పవర్ ఫుల్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది…ఇక రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 వ తేదీన ఈ మూవీ టైటిల్ ను రివీల్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు… ఇక ఒక పవర్ఫుల్ ల్యాండ్ కి సంబంధించిన స్టోరీగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది తెలిస్తే గాని ఈ సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది, హీరో క్యారెక్టర్ ఏంటి అనే విషయంలో క్లారిటీ అయితే రాదు.

మొత్తానికైతే రాహుల్ సంస్కృత్యాయన్ సినిమా సెలక్షన్ అనేది చాలా బాగుంటుంది. అతను కథలను చాలా డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ‘టాక్సీవాలా’ సినిమాతో విజయ్ దేవరకొండ కి సక్సెస్ ని అందించిన ఆయన శ్యామ్ సింగరాయ్ తో కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశాడనే చెప్పాలి.

ఇక ఈ సినిమాతో అటు విజయ్ దేవరకొండకి మరో సక్సెస్ ని అందించడానికి రెడీ అవుతున్నాడు. ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది. తన తోటి హీరోలందరు ఆయనను దాటేసి ముందుకు దూసుకెళ్తుంటే విజయ్ దేవరకొండ మాత్రం సక్సెస్ ను సాధించడంలో చాలా వరకు వెనబడిపోయాడు.

గత సంవత్సరం సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందని అనుకున్నప్పటికి ఆ సినిమాలో అంత పెద్ద మ్యాటర్ లేకపోవడంతో సినిమా ఆశించిన మేరకు విజయాన్ని నమోదు చేసుకోలేక పోయింది… ఈ సినిమా డిఫరెంట్ అటెంప్ట్ గా వస్తుంది. కాబట్టి అలాగే రాహుల్ సాంకృత్యాయన్ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించగలిగే కెపాసిటి ఉన్న దర్శకుడు కావడం వల్ల ఈ సినిమా మీద అంచనాలైతే పెరిగిపోతున్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular