spot_img
Homeఎంటర్టైన్మెంట్Vaani Kapoor: కెమెరా ముందు టెంప్టింగ్ ఫోజులు... హృతిక్ హీరోయిన్ వాణి కపూర్ ఫొటోలు...

Vaani Kapoor: కెమెరా ముందు టెంప్టింగ్ ఫోజులు… హృతిక్ హీరోయిన్ వాణి కపూర్ ఫొటోలు వైరల్

Vaani Kapoor: సన్నజాజి తీగలా నాజూగ్గా ఉంటుంది వాణి కపూర్. సహజంగా సంక్రమించిన సోయగాలను అసలు దాచుకోకుండా ప్రదర్శిస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె చేసే సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. తాజా ఫోటో షూట్ లో ఏకంగా ప్యాంటు బటన్ తీసేసి బోల్డ్ అవతార్ లో కెమెరా ముందుకు వచ్చింది. కాగా వాణి కపూర్ చిత్ర పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. అయినా ఆమెకు బ్రేక్ రాలేదు. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన వాణి కపూర్ శుధ్ దేశీ రొమాన్స్ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో.

శుధ్ దేశీ రోమాన్స్ మంచి విజయం సాధించింది. వాణి కపూర్ రెండో చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. నాని హీరోగా తెరకెక్కిన ఆహా కళ్యాణం మూవీలో హీరోయిన్ గా నటించింది. ఆహా కళ్యాణం మూవీ హిందీ సూపర్ హిట్ బ్యాండ్ బాజా బారాత్ రీమేక్. బాలీవుడ్ లో విజయం సాధించిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ని తెలుగులో ఆహా కళ్యాణం పేరుతో నిర్మించారు.

యష్ రాజ్ ఫిల్మ్స్ ఆహా కళ్యాణం చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఆహా కళ్యాణం తమిళ్ లో కూడా విడుదల చేశారు. కానీ సౌత్ ఆడియన్స్ కి హిందీ ఫ్లేవర్ నచ్చలేదు. దాంతో ఆహా కళ్యాణం డిజాస్టర్ అయ్యింది. ఆ దెబ్బతో మరలా వాణి కపూర్ కి తెలుగులో ఆఫర్ రాలేదు. కాగా వార్ రూపంలో వాణి కపూర్ భారీ హిట్ కొట్టింది. యాక్షన్ ఎంటర్టైనర్ వార్ లో వాణి కపూర్ హీరోయిన్ గా నటించింది. హృతిక్ రోషన్ తో రొమాన్స్ చేసింది.

2019లో విడుదలైన వార్ బ్లాక్ బస్టర్ కొట్టింది. 2021లో అక్షయ్ కుమార్ కి జంటగా బెల్ బాటమ్ చిత్రం చేసింది. అది నిరాశపరిచింది. అదే ఏడాది చాందీఘర్ కరే ఆషీకీ చిత్రం చేసింది. వాణి కపూర్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం రెండు హిందీ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు అల్లాడిస్తుంది. తాజా ఫోటో షూట్ లో జీన్స్ టాప్ ధరించింది. ప్యాంటు బటన్ తీసేసి గ్లామర్ షో చేసింది. నో టైటిల్స్ జస్ట్ వైబ్స్… అని సదరు ఫోటోలకు కామెంట్ జోడించింది.

 

View this post on Instagram

 

A post shared by Vaani Kapoor (@_vaanikapoor_)

RELATED ARTICLES

Most Popular