Queen’s Step Well : వంద రూపాయల నోటు.. మనం నిత్యం వాడుతూనే ఉంటాం. చూస్తుంటాం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు రూ.100 నోటు అనేక రూపాలు మార్చుకుంది. అనేక రూపాంతరాలు చెందింది. దానిపై ముద్రించిన అనేక చిహ్నాలు మారిపోయాయి. తాజాగా పింక్, బ్లూ కలర్‌లో ఉన్న నోట వెనుక ఒక కోట ఫొటో ఉంటుంది. కానీ, దాని గురించి రూ.100 నోటు వాడుతున్న 90 శాతం మందికి తెలియదు. అదొక చారిత్రక కట్టడం దాని విశేషాలు ఎంటో తెలుసుకుందాం.
అద్భుత కట్టడం..
వంద నోటు వెనుక ఉన్న ఈ కోట ఓ మిస్టీరియస్ నిర్మాణం. దీనికి క్వీన్స్ స్టెప్ వెల్ అంటారు. 1889లో దీనిని బ్రిటిష్‌వారు అనుకోకుండా కనిపెట్టారు. 2014లో దీనిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైన్స్ ఇన్ ఇండియా జాబితాలో చేర్చారు. దీనిని 11వ శతాబ్దంలో రాణి ఉదయమతి తన భర్త ఒకటో భీమ్‌దేవ్‌కు గుర్తుగా నిర్మించింది.
ఎక్కడ ఉందంటే..
ఇది గుజరాత్‌లోని ఉన్న ఈ బావి రివర్స్ టెంపుల్ ఆకారంలో ఉంటుంది. ఇలాంటి కట్టడం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ బావిలో 16 రకాల ఆకర్షణీయమైన అప్సరస శిల్పాలు ఉన్నాయి. 500లకు పైగా ప్రధాన శిల్పాలు, వెయ్యికి పైగా చిన్నచిన్న శిల్పాలు ఉన్నాయి. ఈ బావి 88 అడుగుల లోతు ఉంటుంది. చూడడానికి భూగర్భ కోటలా ఉంటుంది. ఈ బావి అడుగున ఒక గేటు ఉంటుంది. దానిని ఓపెన్ చేస్తే 28 కిలోమీటర్ల సొరంగం ఉంటుంది. దానిగుండా వెళ్తే సిర్పూర్ సిటీలోకి వెళ్లొచ్చు. ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయంటారు. కానీ సరిగ్గా వెతికితే మన భారత దేశంలోనే 700ల వింతలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు.