Ustaad Bhagat Singh Shooting: ‘ఓజీ’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం, వచ్చే నెల, అనగా మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఎప్పుడో మొదలైన ఈ సినిమా, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అవ్వడంతో మధ్యలో కొంతకాలం ఆగిపోయింది. మళ్లీ ఉప ముఖ్యమంత్రి అయ్యాక, కొన్ని రోజులు పాలన చూసుకొని, కాస్త సమయం కేటాయించి ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు పవన్ కళ్యాణ్. తన పార్ట్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యి ఆరు నెలలు దాటేసింది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తూ వచ్చాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఇక సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది, కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలిందని అంతా అనుకున్నారు.
కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇంకా వంద శాతం పూర్తి అవ్వలేదట. దాదాపుగా 6 రోజుల ప్యాచ్ వర్క్ మిగిలి ఉందట. ఈ నెల 16 నుండి ఈ ప్యాచ్ వర్క్ కి సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతుంది. ఇది పూర్తి అయ్యాక, ఫైనల్ ఎడిటింగ్ పూర్తి చేసి, మార్చి మొదటి వారం లోపు మొదటి కాపీ ని సిద్ధం చెయ్యాలని చూస్తున్నారట మేకర్స్. ఇప్పటికీ ఈ చిత్రంలో నటించిన నటీనటుల డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. మరో వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ డబ్బింగ్ మినహా, మిగిలిన నటీనటుల డబ్బింగ్ పూర్తి అయిపోతుంది అట. అదే విధంగా ఈ నెల 16 నుండి దేవిశ్రీ ప్రసాద్ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు రీ రికార్డింగ్ పనులు మొదలు పెడుతాడట. ఈ నెల 15న ఈ చిత్రం నుండి 2వ పాటని విడుదల చేయబోతున్నారట మేకర్స్. ఈ పాట చాలా అద్భుతంగా వచ్చిందని అంటున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పులు చూసి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా సర్ప్రైజ్ అయిపోయారు. ఇంత ఎనర్జీ తో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేసి చాలా రోజులే అయ్యింది. అదే విధంగా ఆయన లుక్స్ కూడా అదిరిపోయాయి. చాలా చార్మ్ తో కుర్రాడిలాగానే ఆయన ఈ సాంగ్ లో కనిపించాడు. రాబోయే సాంగ్ లో కూడా ఆయన అలాగే కనిపించబోతున్నాడు అట. చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించాడు. చూడాలి మరి ఈ పాట సినిమాపై ఎంత హైప్ ని క్రియేట్ చేస్తుంది అనేది.
