spot_img
Homeఅంతర్జాతీయంBillionaire Diet Secrets : బిలియనీర్ల డైట్‌ సీక్రెట్స్‌.. జంక్‌ ఫుడ్‌ నుంచి హెల్తీ మీల్స్‌...

Billionaire Diet Secrets : బిలియనీర్ల డైట్‌ సీక్రెట్స్‌.. జంక్‌ ఫుడ్‌ నుంచి హెల్తీ మీల్స్‌ వరకు

Billionaire Diet Secrets : ఆహారం.. ప్రతీ జీవికి అవసరమే. ఆహారం లేకుండా ఏజీవి మనుగడ సాధించదు. చివరకు వృక్షాలు కూడా వాటికి తగిన గాలి, వెలుతురు, నీరు అందినప్పుడే పచ్చగా ఉంటాయి. ఇక మనుషులు తీసుకునే ఆహారం భిన్నంగా ఉంటుంది. పేదలు ఒకరకమైన ఆహారం తీసుకుంతే.. మధ్యతరగతి ప్రజలు తీసుకునే ఆహారం కాస్త మెరుగా ఉంటుంది. ఇక సంపన్నులు తీసుకునే ఆహారం మరింత మెరుగ్గా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటున్నాయి. డబ్బులు ఎంత సంపాదించినా కడుపు నిండా భోజనం చేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ కుభేరులు ఏం తింటారు అన్నది ఆసక్తికరం.

బిల్‌ గేట్స్, వారెన్‌ బఫెట్‌ ఆహారం ఒకేరకం..
వరల్డ్‌ రిచెస్ట్‌ మెన్‌ బిల్‌ గేట్స్‌ చిన్నప్పటి రోజువారి మెనూ గమనిస్తే కోకో పఫ్స్‌ అంటే బాగా ఇష్టం. తృణధాన్యాలకు అభిమాని. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటినే ప్రాధాన్యత ఇస్తారు. డైట్‌ కోక్, ఛీజ్‌ బర్గర్లు కూడా లిస్ట్‌లో ఉన్నాయి. అలాగే, వారెన్‌ బఫెట్‌ రోజుకు 2–3 కోక్‌లు తాగుతూ బేకన్, ఎగ్స్, ఛీజ్‌ బిస్కట్లతో ఐస్‌క్రీమ్, ఆలూ స్టిక్స్‌ను ఆస్వాదిస్తారు. ఈ జంక్‌ ఫుడ్‌ లవర్లు ఫిట్‌నెస్‌పై ఎలాంటి కాంప్రమైజ్‌ చేయకపోవడం ఆసక్తికరం.

ఎలాన్‌ మస్క్, జెఫ్‌ బెజోస్‌ ఆహారం ఇలా..
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవోఎలాన్‌ మస్క్‌ డైట్‌ కోక్, కాఫీతోపాటు ఛీజ్‌ బర్గర్లు, సూషీ, స్టీక్స్, డోనట్‌లకు ఇష్టంగా తీసుకుంటారు. ఇక అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌ మాత్రం లీన్‌ ప్రోటీన్‌లు, ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకుంటారు. పెరుగు, ఆక్టోపస్‌ కాంబోను ఎక్కువగా ఇష్టపడతారు. ఇక మెటా సీఈవో మార్క్‌ జుకర్బర్గ్‌ ఆహారం విషయంలో ఫ్రీ బర్డ్‌. మాంసం ఎప్పుడైనా తింటారు, మూడ్‌ ప్రకారం ఎంపిక చేసుకుంటారు.

ముఖేశ్‌ అంబానీ, రిచర్డ్‌ బ్రాన్సన్‌ ట్రెడిషనల్‌..
రిలయన్స్‌ చైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ శాకాహారి. గుజరాతీ మీల్స్, దోశ, ఇడ్లీ–సాంబార్, పప్పు, రోటీలు రోజువారీ డైట్‌లో తప్పనిసరి. ఇక వర్జిన్‌ గ్రూప్‌ ఫౌండర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌ రోజుకు 20 కప్పుల టీ తాగుతూ పండ్ల సలాడ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలతో బ్యాలెన్స్‌ చేస్తారు. గూగుల్‌ కో–ఫౌండర్‌ లారీ పేజ్‌ తేలికగా జీర్ణమయ్యే పండ్లు, ఆకుకూరలు, డైట్‌ కోక్‌తో నాణ్య ఆహారాలను ప్రిఫర్‌ చేస్తారు.

ఈ బిలియనీర్లు వైవిధ్యమైన డైట్‌లు పాటిస్తూ విజయం సాధించారు. కొందరు జంక్‌ ఫుడ్‌కు మక్కువ. మరికొందరు హెల్తీ ఛాయిస్‌లు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular