Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh OTT release: ఓటీటీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన 'ఉస్తాద్ భగత్...

Ustaad Bhagat Singh OTT release: ఓటీటీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఎందులో చూడాలంటే..

Ustaad Bhagat Singh OTT release: రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఓజీ లాంటి భారీ కమర్షియల్ సక్సెస్ తర్వాత , పవన్ కళ్యాణ్ నుండి ఇలాంటి రొటీన్ సినిమాని అభిమానులు , ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చూడని ఫలితం దక్కింది. అభిమానులు ఈ పచ్చి గాయాన్ని మరిచిపోకముందే , ఇప్పుడు మరోసారి ఆ గాయాన్ని గుర్తు చేయడానికి వాళ్ళ ముందుకు ఓటీటీ ద్వారా రాబోతుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ దాదాపుగా 80 కోట్ల రూపాయిల రేటు కి కొనుగోలు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ముందుగా కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24 న నెట్ ఫ్లిక్స్ లో విడుదల చెయ్యాలి.

కానీ సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడంతో అనుకున్న తేదికంటే ముందే రాబోతుంది. నేడు కాసేపటి క్రితమే సోషల్ మీడియా ద్వారా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 16 న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసింది. తెలుగు తో పాటు , హిందీ తమిళం , కన్నడ మరియు మలయాళం భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. థియేటర్స్ లో దారుణమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం , కనీసం ఓటీటీ లో అయినా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. చాలా సినిమాలు థియేటర్స్ లో ఫెయిల్యూర్స్ గా నిలిచి , ఓటీటీ లో మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘గుంటూరు కారం’. మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా , మహేష్ కెరీర్ లో భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

కానీ నెట్ ఫ్లిక్స్ లో మాత్రం ఈ సినిమాకు 20 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. సినిమాలో విషయం ఉంది, కానీ ఫ్లాప్ టాక్ రావడం వల్ల సరిగా ఆడలేదని అంతా అనుకున్నారు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని కూడా అనేక మంది అభిమానులు , ఈ చిత్రం ‘హరి హర వీరమల్లు’ కంటే చాలా బాగుందని అంటున్నారు. కాబట్టి కచ్చితంగా ఈ సినిమా కూడా గుంటూరు కారం లాగానే మ్యాజిక్ చేస్తుందని , ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి చూస్తారనే చిన్న నమ్మకం అభిమానుల్లో ఉంది. మరి ఆ నమ్మకాన్ని ఈ చిత్రం నిజం చేస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రాన్ని అభిమానులు తప్ప, ప్రేక్షకులు థియేటర్స్ లో పెద్దగా చూడలేదు కాబట్టి, ఓటీటీ లో బాగా చూసే అవకాశం ఉంది. మరి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper