Nani advice to Srikanth Odela: ‘దసర’ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన శ్రీకాంత్ ఓదెల మరోసారి నాని ని హీరోగా పెట్టి చేస్తున్న ‘ప్యారడైజ్’ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా మీద ఆయన స్పెషల్ కేర్ ని తీసుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ సినిమా మధ్యలో కొద్ది రోజులు షూటింగ్ ఆపేశారు. మరి ఇప్పుడు శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుతున్నప్పటికి సినిమా అవుట్ పుట్ విషయంలో కొంతవరకు తడబడినట్టుగా తెలుస్తుంది. ఇక శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు అనుకున్నది చేసేంతవరకు పట్టుబట్టుకొని కూర్చుంటాడు. మరి నాని సైతం అదే రీతిలో ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అయింది. ఇక దానికి తగ్గట్టుగానే సినిమా ఔట్ పుట్ వస్తే బాగుంటుంది లేకపోతే మాత్రం తీవ్రమైన విమర్శలను ఎదురుకోవాల్సిన పరిస్థితి రావచ్చు.
అలాగే నాని కూడా శ్రీకాంత్ కి కొన్ని సజెషన్స్ అయితే ఇస్తున్నాడట. కానీ శ్రీకాంత్ మాత్రం వాటిని పట్టించుకోకుండా తను ఏదైతే చేయాలి అనుకున్నాడో దాన్ని మాత్రమే చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడట…దానివల్ల కొన్నిచోట్ల క్లారిటీ మిస్ అయ్యే అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇక దీని మీద నాని సైతం ఎలా స్పందిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…
ఇక ఈ సినిమా 150 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి నానికి అంత మార్కెట్ అయితే లేదు. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ చేశాడు. కాబట్టి 150 కోట్ల బడ్జెట్ పెట్టినా కూడా అది రికవరీ అవుతుందనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది.
కానీ సినిమా అవుట్ పుట్ బాగుంటే నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. లేకపోతే మాత్రం ఒక నార్మల్ సినిమా గానే మిగిలిపోతుందని మరికొంతమంది భావిస్తున్నారు…ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది… నాని ఈ సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు…