Homeఎంటర్టైన్మెంట్Bujjigadu movie Mohan Babu role: బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు పాత్ర కోసం మొదట...

Bujjigadu movie Mohan Babu role: బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు పాత్ర కోసం మొదట ఆ హీరోను అనుకున్నారా…

Bujjigadu movie Mohan Babu role: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బుజ్జిగాడు’ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అప్పటివరకు ప్రభాస్ నటనలో అంతటి కామెడీ టైమింగ్ గాని డిఫరెంట్ వేరియేషన్స్ గాని చూపించలేదు. ప్రభాస్ ఈ సినిమాతో ఒక్కసారిగా తనలోని పూర్తి స్థాయి యాక్టర్ ని బయటకు తీశాడు. పూరి జగన్నాథ్ సైతం ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ మీద చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా గతంలో చెప్పాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తర్వాత అంతటి ప్రధానమైన పాత్రలో మోహన్ బాబు నటించాడు. మొదట ఆ పాత్ర కోసం పూరి జగన్నాథ్ రాజశేఖర్ ని తీసుకోవాలని అనుకున్నాడట.

కానీ రాజశేఖర్ అప్పుడు సినిమా హీరోగా చేస్తుండడం వల్ల తను ఆ క్యారెక్టర్ ని చేయనని చెప్పడంతో ఆ పాత్రకి మోహన్ బాబు ని సెలెక్ట్ చేశారని గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. ఇక ఏది ఏమైనా కూడా పూరి జగన్నాథ్ తో సినిమా చేసే అదృష్టం చాలా తక్కువ మందికి వస్తుంది… రాజశేఖర్ ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ చాలా వైవిధ్య భరితంగా ఉంటుంది. కాబట్టి దానికి మోహన్ బాబు అయితేనే బాగా సెట్ అయ్యాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. బుజ్జిగాడు సినిమా ప్రభాస్ కెరియర్ లోనే ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాగా నిలిచిపోయింది.

తన ఎంటైర్ కెరియర్ లో ఆయన చేసిన సినిమాల్లో టాప్ 5 లో అతనికి బాగా నచ్చే సినిమాలో బుజ్జిగాడు సినిమా టాప్ 3 లో ఒకటిగా ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ప్రస్తుతం మోహన్ బాబు సైతం సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఆయన ప్యారడైజ్ సినిమాలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు. ఇక దాంతో పాటుగా ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాలో సైతం ఒక వైవిద్య భరితమైన పాత్రను చేస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular