Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh latest update: 'ఉస్తాద్ భగత్ సింగ్' కి పెద్ద చిక్కుముడి వీడినట్టే..ఇక...

Ustaad Bhagat Singh latest update: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి పెద్ద చిక్కుముడి వీడినట్టే..ఇక పాజిటివ్ టాక్ రావడమే బ్యాలన్స్!

Ustaad Bhagat Singh latest update: మరో 22 రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) , హరీష్ శంకర్(Harish Shankar) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమాకు కావాల్సిన హైప్ రావడం లేదు, మంచి ప్రమోషనల్ కంటెంట్ వదలాల్సిందిగా అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి పాట ‘దేఖ్లేంగే సాలా ‘ కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, రీసెంట్ గా విడుదల చేసిన #AuraOfUstaad పాటకు మాత్రం నెగెటివ్ రెస్పాన్స్ భారీ గా వచ్చింది. అభిమానులు దీని నుండి ఈ చిత్రం బయటపడాలని కోరుకుంటున్నారు. అందుకు ఒక సరైన టీజర్ కట్ లేదా మొదటి నుండి అంచనాలు పెంచుతూ వచ్చిన మాస్ బీట్ సాంగ్ ని విడుదల చెయ్యాలని అభిమానులు కోరుతూ ఉన్నారు.

నేడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేస్తారేమో అని అనుకున్నారు కానీ, అది సాధ్యం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదలకు వారం రోజుల ముందు టాక్సిక్ , ధురంధర్ 2 వంటి భారీ పాన్ ఇండియన్ సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి, ఉస్తాద్ భగత్ సింగ్ కి థియేటర్స్ దొరకడం కష్టం అవుతుందేమో, వంద కోట్ల గ్రాస్ ఓపెనింగ్ కష్టమే అని అభిమానులు కూడా బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. కానీ ఆ రెండు సినిమాల్లో ‘టాక్సిక్’ చిత్రం విడుదల అవ్వడం లేదు, జూన్ 4 కి వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ టీం కి పెద్ద అడ్డంకి తొలగినట్టే అని తెలుస్తోంది. ఎందుకంటే ‘టాక్సిక్’ మూవీ తెలుగు వెర్షన్ రైట్స్ ని మన టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసాడు.

Also Read: అనిల్ రావిపూడి పాన్ ఇండియా సినిమా ఎందుకు చేయడం లేదు…ఏదైనా ప్రాబ్లమా..?

దిల్ రాజు కి , ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నిర్మాతలు ‘మైత్రీ మూవీ మేకర్స్ ‘ కి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. నైజాం ప్రాంతం లో దిల్ రాజు కి మంచి పట్టు ఉండడంతో, థియేటర్స్ హోల్డ్ భారీగా ఉంటుందని, ఆ కారణం చేత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి ఈ ప్రాంతంలో థియేటర్స్ దొరకడం చాలా కష్టం అవ్వోచ్చేమో అని అనుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడడంతో ‘టాక్సిక్’ కి కేటాయించిన థియేటర్స్ మొత్తం ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కి షిఫ్ట్ అవ్వబోతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మరో వార్త ఏమిటంటే మార్చి 19 న విడుదల అవ్వబోయే ‘ధురంధర్ 2 ‘ చిత్రం కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని, అదే కనుక జరిగితే ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ బాక్స్ ఆఫీస్ విద్వంసం మామూలు రేంజ్ లో ఉండదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper