Homeఎంటర్టైన్మెంట్Trisha comments on Tamil Nadu CM: తమిళనాడు కి తదుపరి సీఎం నేనే అంటూ...

Trisha comments on Tamil Nadu CM: తమిళనాడు కి తదుపరి సీఎం నేనే అంటూ హీరోయిన్ త్రిష కామెంట్స్.. ఇదే నమ్మకం అంటే..

Trisha comments on Tamil Nadu CM: తమిళనాడు రాజకీయాల్లో హీరోయిన్ త్రిష(Trisha Krishnan) పేరు మారుమోగిపోతుందని మనం కలలో కూడా ఊహించుకొని ఉండము. కానీ ఇప్పుడు అక్కడి రాజకీయాలు మొత్తం ఆమె పేరు చుట్టూనే తిరుగుతోంది. కారణం, తమిళ సూపర్ స్టార్ విజయ్(Thalapathy Vijay) తో ఆమెకు ఉన్న ప్రేమానుబంధం, ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, తొలిసారి పోటీ చేయబోతున్నాడు కాబట్టి, ప్రతిపక్షాలు ఆమె పేరుని తీసుకొచ్చి విజయ్ పై తీవ్రమైన విమర్శలు చేయడమే. […]

Trisha comments on Tamil Nadu CM: తమిళనాడు రాజకీయాల్లో హీరోయిన్ త్రిష(Trisha Krishnan) పేరు మారుమోగిపోతుందని మనం కలలో కూడా ఊహించుకొని ఉండము. కానీ ఇప్పుడు అక్కడి రాజకీయాలు మొత్తం ఆమె పేరు చుట్టూనే తిరుగుతోంది. కారణం, తమిళ సూపర్ స్టార్ విజయ్(Thalapathy Vijay) తో ఆమెకు ఉన్న ప్రేమానుబంధం, ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, తొలిసారి పోటీ చేయబోతున్నాడు కాబట్టి, ప్రతిపక్షాలు ఆమె పేరుని తీసుకొచ్చి విజయ్ పై తీవ్రమైన విమర్శలు చేయడమే. అంతే కాదు , విజయ్ వెనుక నిలబడి రాజకీయాలను మొత్తం నడిపిస్తున్నది త్రిష మాత్రమే అని కథనాలు కూడా ప్రచారం అవుతున్నాయి. అప్పట్లో ఎంజీఆర్ కి వెన్నుముక గా జయలలిత ఎలా నిలబడిందో, ఇప్పుడు విజయ్ కి కూడా త్రిష అలా నిలబడింది , భవిష్యత్తులో ఆమె TVK పార్టీ తరుపున పోటీ చేసి సీఎం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు.

ఇదంతా పక్కన పెడితే త్రిష కి నిజంగానే రాజకీయాల పై ప్రత్యేక ఆసక్తి ఉంది. ఈ విషయాన్ని ఆమె అనేక ఇంటర్వ్యూస్ లో అనేక సార్లు చెప్పింది. ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ , నాకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది, కచ్చితంగా అవుతాను అంటుంది. అందుకు యాంకర్ నవ్వగా , నేను కామెడీ చెయ్యడం లేదు, నిజంగానే చెప్తున్నాను అని త్రిష అంటుంది. ఏ ధైర్యం తో ఆమె అలా చెప్పిందో అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు, కానీ ఇప్పుడు జరుగుతున్నా రాజకీయ పరిణామాలను చూస్తుంటే , విజయ్ ని చూసుకొనే ఈ మాట చెప్పిందా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఆమె అప్పట్లో మాట్లాడిన ఈ మాటకు ఫన్నీ వీడియో కౌంటర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దానిని చూస్తే మీకు కూడా నవ్వు రాక తప్పదు.

Also Read: ప్రపంచంలోనే తొలి ఇండియన్ నటిగా నిల్చిన రష్మిక..నమోదైన అరుదైన రికార్డు..

అదే వీడియో లో ఆమె టైం కూడా చెప్పడం గమనార్హం. సరిగ్గా 10,15 ఏళ్లలో సీఎం అవుతాను చూడండి, మీరందరూ నాకు ఓటు వెయ్యాలి అని అంటుంది. అందుకు అందరూ అప్పట్లో నవ్వారు కానీ , ఇప్పటి పరిస్థితులను చూసి ఆమ్మో త్రిష మామూలుది కాదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే తమిళనాడు లో జరగబోయే ఎన్నికల కోసం, త్రిష TVK పార్టీ తరుపున 50 నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి సిద్ధం గా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు సంబందించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి అట. రీసెంట్ గానే విజయ్ తనకు త్రిష తో ఉన్న బంధాన్ని బహిర్గతం చేసిన తర్వాత, ఇక మీదట ఎలాంటి దాపరికం లేకుండా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper