spot_img
Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Bitthiri Sathi: వేణు స్వామిని టార్గెట్ చేసిన బిత్తిరి సత్తి.. పబ్లిక్ లో పరువు తీశాడుగా!...

Bitthiri Sathi: వేణు స్వామిని టార్గెట్ చేసిన బిత్తిరి సత్తి.. పబ్లిక్ లో పరువు తీశాడుగా! వీడియో వైరల్

Bitthiri Sathi: వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి తరచుగా వార్తల్లో ఉంటున్నాడు. సినీ తారలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సెలబ్రిటీ జ్యోతిష్యుడు అయ్యాడు. కొందరు స్టార్ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కాంట్రావర్సీ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. ఎవరేమనుకున్నా వేణు స్వామి చెప్పాలనుకున్నది నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. ఆయన జాతకం నిజం అవుతుందనే వాదన ఉంద

తాజాగా వేణు స్వామి ని ట్రోల్ చేస్తూ బిత్తిరి సత్తి చేసిన కామెడీ మామూలుగా లేదు. బిత్తిరి సత్తి వేణు స్వామి పరువు తీసేశాడు. ఉగాది పండుగ సందర్భంగా జీ తెలుగులో ఓ స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ షోకి నటుడు ఆలీ, హీరోయిన్ రాశి, సీరియల్ నటి కస్తూరి గెస్టులుగా హాజరయ్యారు. కాగా బిత్తిరి సత్తి కూడా షో లో పాల్గొన్నాడు. ఇక నా పేరు వేలు స్వామి అంటూ ఎంట్రీ ఇచ్చాడు.

అచ్చం వేణు స్వామి మాదిరి రెడీ అయి వచ్చాడు. వస్తూనే ఆలీని చూసి మే నెలలో ఏం జరగబోతుందో నీకు చెప్పాలి అని అంటాడు. దీంతో అసలు ఏం చెబుతాడని ఆలీ ఆసక్తిగా చూస్తుంటాడు. మే నెలలో ఎండలు ఇంకా ఎక్కువవుతాయని సత్తి చెబుతాడు. ఇక హీరోయిన్ రాశి దగ్గరకు వెళ్లి .. నేను ఇంతకు ముందే చెప్పా .. మీరు ఒక ప్రముఖ హీరో మీద చేయి చేసుకుంటారు అని అంటాడు. అలాంటిది ఏం లేదు .. నేను అలా చేయలేదని రాశి అంటుంది.

అయితే మీకొక వీడియో చూపిస్తాను అంటూ సత్తి చెబుతాడు. ఆ తర్వాత కస్తూరి జాతకం చెప్పాడు. మీరు హీరోయిన్ గా నటించిన సినిమా త్వరలో రీ రిలీజ్ అవుతుంది అని చెప్పాడు. నేను నటించిన అంత పెద్ద సూపర్ హిట్ ఏముందని కస్తూరి అంటుంది. అన్ని సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. అన్నమయ్య ఎందుకు కాకూడదు అని బిత్తిరి సత్తి ప్రశ్నించాడు. కాగా ఈ ప్రోమో వైరల్ అవుతుంది. వేణు స్వామిని ఇమిటేట్ చేస్తూ సత్తి చేసిన కామెడీకి అందరూ నవ్వేశారు…

 

Related News

Most Popular

Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper