spot_img
Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Samantha: ఆ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్న నాగ చైతన్య... కోపంతో సమంత చేసిన పనికి...

Samantha: ఆ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్న నాగ చైతన్య… కోపంతో సమంత చేసిన పనికి అందరూ షాక్!

Samantha: సమంత – నాగ చైతన్య విడిపోయి చాలా కాలం అవుతుంది. వాళ్ళ విడాకుల టాపిక్ మాత్రం వార్తల్లో నిలుస్తూనే ఉంది. సమంత – నాగ చైతన్య విడాకుల అనంతరం పలు రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఇదిలా ఉంటే నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ప్రేమలో ఉన్నారట. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారట. ఓ రెండేళ్లుగా వీరిద్దరి ఎఫైర్ పై కథనాలు వెలువడుతున్నాయి.

ఒకసారి లండన్ వెకేషన్ లో, మరోసారి రెస్టారెంట్ లో కలిసి కనిపించడంతో ఈ డేటింగ్ రూమర్స్ కి మరింత బలం చేకూరింది. తాజాగా నాగ చైతన్య తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటో షేర్ చేసాడు. ఆ ఫోటోకి శోభిత లైక్ కొట్టింది. దీంతో మరోసారి వీరి వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆ ఫోటో తీసింది శోభితనే అని .. వాళ్లిద్దరూ కలిసి ఎక్కడికో వెకేషన్ కి వెళ్లారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శోభిత సైతం ఒక ఫోటో పోస్ట్ చేసింది. నాగ చైతన్య ఫోటో దిగిన లొకేషన్, శోభిత పోస్ట్ చేసిన ఫోటో లొకేషన్ కి దగ్గరగా ఉంది. కాగా సమంత – నాగ చైతన్య విడాకులు తర్వాత వాళ్ళ వాళ్ళ కెరీర్లో బిజీ అయ్యారు. అయితే సమంత చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. చైతన్య కి సంబంధించిన జ్ఞాపకాలు తన దగ్గర ఉండకూడదు అనుకుందో లేక మరో కారణమో తెలియదు కానీ .. తన పెళ్లి నాటి గౌను రీ మోడల్ చేయించింది.

రీమోడలింగ్ చేయించిన ఆ డ్రెస్సును సమంత ఓ అవార్డు ఫంక్షన్ లో ధరించింది. ఈ విషయం సమంత చెప్పే వరకు పెళ్లి గౌను రీ మోడలింగ్ చేయించిందని ఎవరికీ తెలియదు. తన ఇన్ స్టాగ్రామ్ లో దానికి సంబంధించిన వీడియో ఒకటి పోస్ట్ చేసింది. సదరు వీడియో చూసిన వారు నాగ చైతన్య అంటే అంత కోపమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శోభిత-నాగ చైతన్య వ్యవహారం నచ్చని కారణంగా ఇలా చేసిందని కూడా అంటున్నారు. ఇక నాగ చైతన్య ‘ తండేల్ ‘ టైటిల్ తో ఒక మూవీ చేస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper