Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 AD . ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా కల్కి మూవీ సమ్మర్ కానుకగా మే 9న విడుదల అంటూ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎన్నికల హడావుడి నెలకొన్న నేపథ్యంలో వాయిదా వేశారు. అయితే ఎన్నికలు ముగిసి, రిజల్ట్స్ వచ్చాకే సినిమా విడుదల ఉంటుందని ప్రచారం జరిగింది. ఖచ్చితంగా విడుదల ఎప్పుడు అనేది క్లారిటీ లేదు.
దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. జూన్ 27న కల్కి విడుదల అంటూ పోస్టర్ విడుదల చేశారు. కల్కి నయా పోస్టర్లో ప్రభాస్, అమితాబ్, దీపికా పదుకొనె ఉన్నారు. వారి లుక్స్ కాకరేపుతున్నాయి. కల్కి సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య జరిగిన సమావేశంలో కల్కి కొత్త రిలీజ్ డేట్ పై చర్చించారట. జూన్ 27న విడుదలవుతుందనే ప్రచారం జరిగింది. అనుకున్నట్లే నిర్మాతలు ఇదే డేట్ ప్రకటించారు.
నిజానికి కల్కి సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. దాన్ని మే 9కి పోస్ట్ పోన్ చేశారు. మరలా జూన్ 27కి వాయిదా పడింది.
కల్కి చిత్రంలో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, దిశా పటాని నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ప్రభాస్ లైనప్ చూస్తూ… రాజా సాబ్, సలార్ 2, కన్నప్ప వంటి చిత్రాలు చేస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ తో ‘ స్పిరిట్ ‘ చేయాల్సి ఉంది. అలాగే హను రాఘవపూడి తో ఓ సినిమాకు సైన్ చేశాడని సమాచారం.