Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ‘ సీతారామం ‘ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ముఖ్యంగా యూత్ కి డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఆ తర్వాత నాని తో కలిసి నటించిన హాయ్ నాన్న సైతం హిట్ స్టేటస్ దక్కించుకుంది. తాజాగా విజయ్ దేవరకొండకు జంటగా ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 5న విడుదల కానుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా మృణాల్ ఓ ఇంటర్వ్యూ కు హాజరైంది. ఈ సందర్భంగా పెళ్లి, పిల్లలు, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఈ క్రమంలో యాక్టర్ అవ్వాలనే ఆలోచనే తనకు లేదని మృణాల్ చెప్పింది. చిన్నప్పటి నుంచి మిస్ వరల్డ్ అవ్వాలనే కోరిక ఉందేదట. కానీ బికిని వేసుకోవాల్సి వస్తుందని భయంతో ఆ ఆలోచన వదిలేసిందట. తనకు హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ అంటే చాలా ఇష్టమట . వాళ్ళతో కలిసి పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నాని మృణాల్ చెప్పింది. ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారని అడగ్గా .. రాముడు లాంటి అబ్బాయిలంటే చాలా ఇష్టం అని .. నిజంగా లైఫ్ లో రాముడు లాంటి కుర్రాళ్ళు ఉంటే వెంటనే వచ్చి నన్ను కలవండి .. రింగ్ కూడా రెడీగా ఉంది అంటూ నవ్వేసింది.
అయితే సెలెబ్రెటీ అవ్వడం వల్ల ఇంత అభిమానం దొరికినందుకు సంతోషంగా ఉందని మృణాల్ తెలిపింది. మరోవైపు తనకు ఒక్కోసారి నార్మల్ లైఫ్ గడపాలనిపిస్తుందని .. ఇరవైల్లోనే పెళ్లి చేసుకుని, పిల్లల్ని కంటే, కోరుకున్నప్పుడు డిన్నర్ కోసం రెస్టారెంట్ కు వెళ్లి రావొచ్చు. ఎలాంటి పరిమితులు ఉండవు కదా అని చెప్పింది. ఇక తనని అత్యంత భయపెట్టేది మరణం అట. తాను చనిపోతే నా కుటుంబం ఏమైపోతుందా అని ఎక్కువగా ఆలోచిస్తానంటూ చెప్పుకొచ్చింది.
కాగా ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి. గీత గోవిందం ఫేమ్ పరుశురాం ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు భారీ హిట్టులు కొట్టి ఈ సినిమా తో హ్యాట్రిక్ కొట్టాలని మృణాల్ ఠాకూర్ ఎదిరిచూస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ ఆమెకు ఎటువంటి విజయం తెచ్చిపెడుతుందో వేచి చూడాలి.
Web Title: Mrunal thakur crazy comments are going viral on social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com