Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Anasuya Bharadwaj: చేసిన తప్పుకు పశ్చాత్తాపం... పబ్లిక్ గా క్షమాపణలు అడిగిన ఫైర్ బ్రాండ్ అనసూయ!

Anasuya Bharadwaj: చేసిన తప్పుకు పశ్చాత్తాపం… పబ్లిక్ గా క్షమాపణలు అడిగిన ఫైర్ బ్రాండ్ అనసూయ!

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. పుష్ప 2 లో పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతుంది. మరి కొన్ని ప్రాజెక్ట్స్ లో ఆమె నటిస్తోంది. ఇదిలా ఉంటే… అనసూయ తాను చేసిన తప్పుకు క్షమించండి అంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకుంది. మొదటిసారి అనసూయ ఒకరికి తలవంచి సారీ చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు అనసూయ ఎందుకు క్షమాపణలు కోరింది. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ యాంకర్ గా సంచలనం సృష్టించింది. బుల్లితెర పై ఆమె చేసిన సంచనాలు అన్ని ఇన్ని కావు. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లోకి వచ్చింది. లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసి నటిగా సెటిల్ అయిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. అనసూయకి ఎంతటి క్రేజ్ ఉందో అదే స్థాయిలో నెగిటివిటీ కూడా ఉంది. ఆమెపై నిత్యం విమర్శలు వస్తుంటాయి.

ముఖ్యంగా అనసూయ డ్రెస్సింగ్ విపరీతంగా ట్రోల్స్ కి గురవుతుంది. అలాంటి వారికి తన స్టైల్ లో గట్టిగా కౌంటర్లు ఇస్తుంటుంది. ఎవరేమనుకున్నా పట్టించుకోదు. పైగా వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతుంటుంది. అలా ఫైర్ బ్రాండ్ లా వ్యవహరించే అనసూయ మొదటిసారి క్షమాపణ చెప్పింది. ఆమె గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇన్ యాక్టివ్ గా ఉంటున్నారు.

బిజీ షెడ్యూల్ కారణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం లేదు. అందుకే అనసూయ తనని క్షమించాలి అని ఒక పోస్ట్ పెట్టింది. ఆమె ఫ్యాన్స్ కు అందుబాటులో లేనందుకు ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారని భావించి అనసూయ ఈ విధంగా క్షమాపణలు కోరింది. అయితే త్వరలో అనసూయ బుల్లితెర ఎంట్రీ ఇవ్వబోతోంది. స్టార్ మా ఛానల్ లో ఓ షో కి యాంకర్ గా రాబోతుందని తెలుస్తుంది.

RELATED ARTICLES

Most Popular