Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Photo Story: ఈ క్యూట్ బేబీ ఇప్పుడు ఓ హాట్ బ్యూటీ... ఎవరో తెలిస్తే మీ...

Photo Story: ఈ క్యూట్ బేబీ ఇప్పుడు ఓ హాట్ బ్యూటీ… ఎవరో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది!

Photo Story: ఈ ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఈ పాప… ప్రస్తుతం హాట్ బ్యూటీ. హీరోయిన్స్ కి మించిన క్రేజ్ ఆమె సొంతం. ఆమె గ్లామర్ కి యూత్ షేక్ అవుతుంది. ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఉన్న అమ్మడు.. నటిగా మారింది. వెండితెరపై సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది. అమ్మడు ఫైర్ బ్రాండ్ కూడాను. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటుంది. సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటు ఉంటుంది. ఎందరు టార్గెట్ చేసినా అసలు తగ్గదు.

కొందరు యాటిట్యూడ్ అని విమర్శించినా అది నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటుంది. తన హేటర్స్ ని రెచ్చగొట్టేలా పోస్ట్స్ పెడుతుంది. ఎవరేమనుకున్నా నచ్చినట్లు బ్రతకాలి అనే సిద్ధాంతం ఫాలో అవుతుంది. ఇప్పటికే ఆమె ఎవరో మీకు ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది. ఎవరో కాదు అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ వేదికగా అనసూయ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. తెలుగులో మొట్టమొదటి గ్లామరస్ యాంకర్ అనసూయ.

అనసూయకు ముందు తెలుగు యాంకర్స్ ఎవరూ పొట్టి బట్టలు ధరించిన దాఖలాలు లేవు. ఆ రూల్ బ్రేక్ చేసింది అనసూయ. ఈ క్రమంలో అనేక విమర్శలు ఎదుర్కొంది. అనసూయ డ్రెస్సింగ్ పలుమార్లు వివాదాస్పదం అయ్యింది. నా బట్టలు నా ఇష్టం. మీరు ఎవరు నాకు చెప్పడానికి అంటుంది. నాకు కంఫర్ట్ అనిపిస్తే ఎలాంటి బట్టలైనా ధరిస్తాను అని అనసూయ విమర్శకుల నోళ్లు మూయించింది. దాదాపు 9 ఏళ్ళు జబర్దస్త్ లో ఉంది అనసూయ. 2022లో ఆ షోకి గుడ్ బై చెప్పింది.

ప్రస్తుతం పూర్తి స్థాయి నటిగా కొనసాగుతుంది. ఆమెకు విలక్షణ పాత్రలు దక్కుతున్నాయి. గత ఏడాది రంగమార్తాండ, విమానం, ప్రేమ విమానం, మైఖేల్, పెదకాపు 1 చిత్రాల్లో ఆమె నటించారు. నెక్స్ట్ పుష్ప 2 లో దాక్షాయణిగా మరోసారి అలరించనుంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. అనసూయ చేతిలో మరి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular