Homeఎంటర్టైన్మెంట్Waltair Veerayya Teaser: మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య' మూవీ టీజర్ హైలైట్స్ ఇవే

Waltair Veerayya Teaser: మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ మూవీ టీజర్ హైలైట్స్ ఇవే

Waltair Veerayya Teaser: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్నాడు..ఈ సినిమా తర్వాత ఆయన చేస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’..పవర్ , సర్దార్ గబ్బర్ సింగ్ మరియు జై లవ కుశ వంటి సినిమాలు తీసిన బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శృతి హాసన్ హీరోయిన్ గా, మరియు మాస్ మహారాజ రవితేజ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు..భారీ బడ్జెట్ తో క్వాలిటీ పరంగా […]

Waltair Veerayya Teaser: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్నాడు..ఈ సినిమా తర్వాత ఆయన చేస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’..పవర్ , సర్దార్ గబ్బర్ సింగ్ మరియు జై లవ కుశ వంటి సినిమాలు తీసిన బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శృతి హాసన్ హీరోయిన్ గా, మరియు మాస్ మహారాజ రవితేజ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు..భారీ బడ్జెట్ తో క్వాలిటీ పరంగా ఎక్కడా కూడా తగ్గకుండా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు..ఇక పుష్ప సినిమా మ్యూజిక్ తో దేశాన్ని ఒక ఊపు ఊపిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు..వచ్చే సంక్రాంతి కానుకగా ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కి సంబంధించి డబ్బింగ్ వర్క్ ని ఈరోజే ప్రారంభించారు..ప్రస్తుతం హైదరాబాద్ లో చిరంజీవి పై భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు..ఇక ఈ దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు మూవీ టీం..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చెయ్యబోతున్నారు.

Waltair Veerayya Teaser
chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ని అభిమానులు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో..అలా చూపించబోతున్నాడట డైరెక్టర్ బాబీ ఈ సినిమా ద్వారా..చిరంజీవి మన అందరం నచ్చేది ఆయనలోని మాస్, ఫైట్స్, కామెడీ టైమింగ్ మరియు డ్యాన్స్..ఇవన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయట..దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం 5 మాస్ డాన్స్ నంబర్స్ ని కంపోజ్ చేసాడట..అభిమానులకు ఇది కనుల పండుగలాగా ఉంటుందట..రీ ఎంట్రీ లో ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత చిరంజీవి తన మార్కు కమర్షియల్ సినిమాలు చెయ్యలేదని చెప్పాలి..సైరా నరసింహ రెడ్డి, ఆచార్య మరియు గాడ్ ఫాదర్ ఈ మూడు చిత్రాలు కూడా నాన్ కమర్షియల్ సినిమాలు అవ్వడం తో అభిమానులు చిరంజీవి నుండి తన మార్కు ఎంటర్టైనర్ ని కోరుకుంటున్నారు.

Waltair Veerayya Teaser
chiranjeevi

ఈ సినిమా సరిగ్గా వారి అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుందట..ఆ విషయం ఈ దీపావళి కి విడుదల చెయ్యబొయ్యే టీజర్ తోనే అర్థం అయిపోతుంది అంటున్నారు మూవీ టీం,,అదిరిపొయ్యే యాక్షన్ కట్స్ మరియు మాస్ డైలాగ్ తో ఈ టీజర్ ని మలిచాడట డైరెక్టర్ బాబీ..రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కి ది బెస్ట్ టీజర్ కట్ గా నిలుస్తుందని చెప్తున్నారు..విడుదలకి ముందే ఇంత పాజిటివ్ అంచనాలను పెంచిన ఈ టీజర్ కట్..విడుదల తర్వాత ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.



Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper