Bigg Boss 6 Telugu- Vasanti And Marina: ఈ ఏడాది బిగ్ బాస్ సీసన్ ఎంత ఆసక్తికరంగా సాగుతుందో మన అందరికి తెలిసిందే..ప్రారంభం లో కాస్త స్లో గానే ఈ షో నడిచినప్పటికీ, ఇప్పుడు బిగ్ బాస్ రోజు రోజుకి కొత్త టాస్కులు ఇస్తూ ప్రేక్షకులను ఆసక్తిగా టీవీలకు అతుక్కుపొయ్యేలా చేస్తున్నాడు..ఇక ఈ వారం బ్యాటరీ ఛార్జింగ్ టాస్కు ఎంత ఆసక్తికరంగా సాగిందో మన అందరికి తెలిసిందే..వంద శాతం ఉన్న బ్యాటరీ ఛార్జింగ్ పాయింట్స్ ని ఉపయోగించుకొని,కంటెస్టెంట్స్ తమ ఇంటి సభ్యులతో మాట్లాడుకోవడమో..లేదా వాళ్ళు పంపిన వస్తువులు తీసుకోవడమో చెయ్యాలి..అలా ఈ టాస్కు గత మూడు రోజుల నుండి ఆసక్తికరంగా సాగింది..అయితే ఈ టాస్కులో ఆది రెడ్డి భార్య మాట్లాడిన వీడియో కాల్ హౌస్ లో పెద్ద అలజడి సృష్టించింది..ముఖ్యంగా నిన్న అర్థ రాత్రి అందరూ పడుకున్న సమయం లో బెడ్ మీద మెరీనా మరియు వాసంతి మాట్లాడుకున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆమె కాల్ లో చాలా యాటిట్యూడ్ చూపించిందని వాసంతి మెరీనా తో అంటుంది..అంతే కాకుండా నీ తప్పు లేకుండా మాటలు పడకు..ఇచ్చి పారేసేయి అని ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది..ఆలా మాట్లాడడం తప్పు కదా..తమ తప్పు లేకుండా మాటలు ఇక్కడ ఎవరు పడుతున్నారు..? మనం కూడా అలా మాటలు పడాల్సిన పరిస్థితి వస్తే ఇచ్చి పారేస్తాం కదా అంటూ మెరీనా వాసంతి తో అంటుంది..అంతే కాకుండా ఆది రెడ్డి ఈ వారం నామినేషన్స్ లో సేఫ్ గా ఉన్నాడని గ్రీన్ బాల్ పట్టుకొని అతనికి హింట్ ఇచ్చిందని వాసంతి అంటుంది.

ఇలా వీళ్లిద్దరు అర్థ రాత్రి చేసుకుంటున్న గుసగుసల వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఈ వీడియో ని చూపించి ఈ వీకెండ్ లో అక్కినేని నాగార్జున గారు మెరీనా మరియు వాసంతి కి క్లాస్ పీకే అవకాశం ఉందని అంటున్నారు నెటిజెన్లు..ఇక ఈ వారం నామినేషన్స్ లో శ్రీహాన్, గీతూ, కీర్తి , శ్రీ సత్య , ఆది రెడ్డి, మెరీనా, బాలాదిత్య,రాజ్ శేఖర్ మరియు సుదీప ఉన్నారు..వీరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో చూడాలి.