The Paradise Vs Jailer 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోలందరిని మినహాయిస్తే నాని లాంటి టాలెంటెడ్ హీరో సైతం ప్రస్తుతం స్టార్ హీరోగా మారడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకుముందు దసర సినిమాతో మాస్ సినిమాను చేసిన ఆయన ఇప్పుడు మరోసారి తన సత్తా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న చాలామంది దర్శకులు పాన్ ఇండియా సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక నాని లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అతను మాస్ హీరోగా అవతరించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఆయన చేస్తున్న ప్యారడైజ్ సినిమా ఈ సంవత్సరం మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకి వస్తుందంటూ అనౌన్స్ చేసినప్పటికి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు 21వ తేదీన రిలీజ్ అవ్వబోతుందంటూ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
దాంతో నాని అభిమానులతో పాటు శ్రీకాంత్ ఓదెల ఫ్యాన్స్ సైతం సినిమా రిలీజ్ లేట్ అవుతున్నందుకు కొంతవరకు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికి సినిమా అవుట్ పుట్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని అలాంటి నిర్ణయం తీసుకున్నారని చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్షన్ లో వస్తున్న జైలర్ 2 సినిమా కూడా ఆగస్టు లోనే రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఇంకా అఫీషియల్ గా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనప్పటికి ఈ రెండు సినిమాల మధ్య పోటీ అయితే ఉండబోతుంది అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ రెండింటిలో ఏ సినిమా విజయాన్ని సాధిస్తుంది.
ఏ సినిమా డీలా పడుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది… ‘జైలర్’ సినిమా సక్సెస్ అవ్వడంతో ‘జైలర్ 2’ సినిమా మీద ఆటోమేటిగా అంచనాలైతే పెరిగాయి. కానీ ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…