Homeఆంధ్రప్రదేశ్‌Agrigold Plots: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్!

Agrigold Plots: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్!

Agrigold Plots: అగ్రిగోల్డ్( agri gold ) విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్డ్ కు సంబంధించి ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారికి ఉపశమనం ఇచ్చింది. అగ్రిగోల్డ్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కార్యకలాపాలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో కొంతమంది అగ్రిగోల్డ్ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇంతలోనే అగ్రిగోల్డ్ పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిపై ప్రభావం చూపింది. అగ్రిగోల్డ్ ఆస్తులు జప్తునకు వెళ్లిపోయాయి. […]

Agrigold Plots: అగ్రిగోల్డ్( agri gold ) విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్డ్ కు సంబంధించి ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారికి ఉపశమనం ఇచ్చింది. అగ్రిగోల్డ్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కార్యకలాపాలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో కొంతమంది అగ్రిగోల్డ్ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇంతలోనే అగ్రిగోల్డ్ పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిపై ప్రభావం చూపింది. అగ్రిగోల్డ్ ఆస్తులు జప్తునకు వెళ్లిపోయాయి. అయితే అప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న ప్లాట్లకు సంబంధించి జప్తు మినహాయింపు ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం ఆ జుట్టు నుంచి మినహాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పై ప్లాట్లు కొనుగోలు చేసిన వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు.

* అప్పట్లో టిడిపి ప్రభుత్వం మినహాయింపు..
అగ్రిగోల్డ్ సంస్థ కార్యకలాపాలు ముగించిన తరుణంలో లక్షలాదిమంది ఖాతాదారులు ఆందోళనకు గురయ్యారు. 2017 ఫిబ్రవరి 20న అప్పటి టిడిపి ప్రభుత్వం అగ్రిగోల్డ్ కు చెందిన 16,857.81 ఎకరాల భూమి, 82,207.08 చదరపు గజాల స్థలాలను జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జప్తు చేసిన భూముల్లో కొన్నిచోట్ల అగ్రిగోల్డ్ కు సంబంధించి లేఅవుట్లు కూడా ఉన్నాయి. అయితే కొంతమంది ఈ లేఅవుట్లలో వీటిలో ప్లాట్లు కొనుగోలు చేసి పూర్తిగా డబ్బులు చెల్లించారు. రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు. ఇటువంటి వారు అప్పటి టిడిపి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ ప్లాట్ లను ప్రభుత్వం జప్తు నుంచి మినహాయిస్తున్నట్లు స్పష్టంగా ఉత్తర్వుల్లో క్లారిటీ ఇచ్చింది. కానీ గత వైసిపి ప్రభుత్వం ఈ మినహాయింపును తొలగించడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా ఆందోళనకు గురయ్యారు.

* ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో..
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇటువంటి ప్లాట్లను కొనుగోలు చేసిన వారంతా ఏపీ సిఐడి అధికారులను( AP CID officers) కలిశారు. ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. దీంతో వారు సానుకూలంగా స్పందించారు. అప్పట్లో టిడిపి ప్రభుత్వం ఈ ప్లాట్ల జప్తు మినహాయింపు కోసం ఇచ్చిన ఉత్తర్వులను ఇప్పుడు పునరుద్ధరించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అగ్రిగోల్డ్ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper