The Paradise movie release postponed: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ప్యారడైజ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా ఈ ఏడాది మార్చి 26వ తేదీన రిలీజ్ అవ్వాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాని ఆగస్టు 21వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలైతే చేస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ తొందరలోనే కంప్లీట్ అవుతుందని అందరు అనుకుంటున్నారు. కానీ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా వరకు లేట్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆగస్టు 21 అంటే మహా అయితే ఇంకొక 4 నెలల సమయం మాత్రమే ఉంది.
ఈ సమయంలో ఈ సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయా? లేదా అనేది అందరిలో ఒక డౌట్ కలుగుతుంది. మన దర్శకుడు సైతం ఆగస్టు 21వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు.
కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని మరోసారి వాయిదా వేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది…ఆగస్టు నుంచి సెప్టెంబర్ కి ఈ సినిమా రిలీజ్ డేట్ షిఫ్ట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నాని లాంటి నటుడు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఆయన ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఇక ఈ సినిమా సైతం సూపర్ సక్సెస్ ను సాధిస్తే తనకు ఇక తిరుగు ఉండదనే ఉద్దేశ్యంతో ఆయన ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది…
ఇక ఈ సినిమా సక్సెస్ అవుతుందా? లేదా నాని తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… నాని ఇక ఈ మూవీతో పాటు సుజీత్ డైరెక్షన్ లో ‘బ్లడీ రోమియో’ అనే సినిమా చేస్తున్నాడు…
