Homeఎంటర్టైన్మెంట్Darling re release 4 days collections: 'డార్లింగ్' రీ రిలీజ్ 4 రోజుల వసూళ్లు.....

Darling re release 4 days collections: ‘డార్లింగ్’ రీ రిలీజ్ 4 రోజుల వసూళ్లు.. ‘బాహుబలి’ తర్వాతి స్థానాన్ని టార్గెట్ చేశాడుగా..

Darling re release 4 days collections: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన ‘డార్లింగ్'(#Darling4K) చిత్రాన్ని రీసెంట్ గానే అభిమానులు, మూవీ లవర్స్ కోసం 4K కి మార్చి గ్రాండ్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కల్ట్ క్లాసిక్ అనే బ్రాండ్ ఉంది , ప్రభాస్ అభిమానులతో పాటు, ఇతర హీరోల అభిమానులు కూడా ఈ చిత్రాన్ని తెగ ఇష్టపడుతారు కాబట్టి […]

Darling re release 4 days collections: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన ‘డార్లింగ్'(#Darling4K) చిత్రాన్ని రీసెంట్ గానే అభిమానులు, మూవీ లవర్స్ కోసం 4K కి మార్చి గ్రాండ్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కల్ట్ క్లాసిక్ అనే బ్రాండ్ ఉంది , ప్రభాస్ అభిమానులతో పాటు, ఇతర హీరోల అభిమానులు కూడా ఈ చిత్రాన్ని తెగ ఇష్టపడుతారు కాబట్టి , కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా ఆశించారు. కానీ రీ రిలీజ్ లో ఈ చిత్రానికి ఊహించినదానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం గమనార్హం. విడుదలై 4 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చింది అనేది చూద్దాం. నిన్నటితో ఈ చిత్రం ఖుషి రీ రిలీజ్ ఫుల్ రన్ గ్రాస్ ని దాటినట్టు తెలుస్తోంది.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 4 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, వరల్డ్ వైడ్ గా 57 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఓవరాల్ గా ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒక్కసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంతం నుండి 49 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం నుండి 2 కోట్ల 20 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి ప్రీమియర్ షోస్ తో కలిపి 6 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రానికి , ఓవర్సీస్ నుండి 48 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 7 కోట్ల 82 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ పెర్ఫార్మన్స్ గురించి చూసుకుంటే ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి చాలా తక్కువ గ్రాస్ నమోదైంది . అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి కూడా చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అద్భుతమైన గ్రాస్ వసూళ్లను నమోదు చేసుకోగా, నైజాం ప్రాంతం నుండి మాత్రం సెన్సేషనల్ పెర్ఫార్మన్స్ ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు. ప్రభాస్ కి నైజాం ప్రాంతం కంచు కోట లాంటిదని అందరూ అంటుంటారు, అలా ఎందుకు అంటారో ఈ రిలీజ్ మరోసారి రుజువు చేసింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper