Exposing Heroines: ఒకప్పుడు హీరోయిన్ అంటే సంప్రదాయ చీరకట్టు లేదా లంగావోణిలో మాత్రమే కనిపించేవారు. కేవలం ఐటం సాంగ్ చేసే జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్‌స్మిత లాంటి వాళ్లు మాత్రమే ఒళ్లు చూపించేవారు. కానీ క్రమేణా హీరోయిన్లకు, ఐటం సాంగ్ చేసే వారికి ఉన్న తేడా తగ్గుతూ వచ్చింది. హీరోయిన్లే ఐటం సాంగ్స్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికీ అది కొనసాగుతోంది. 1970 వరకు హీరోయిన్లు సంప్రదాయంగా ఉండగా, నేటి హీరోయిన్స్ ఇప్పుడు ఒళ్లు చూపించేందుకే ఆసక్తి చూపుతున్నారు. అభిమానులు కూడా ఎక్స్‌పోజింగ్ చేసే హీరోయిన్లనే ఎక్కువగా ఫాలో అవుతున్నారు.

అందరి విషయంలో కాకపోయినా..
ఒంటిమీద బట్టల్లేకుండా కనిపిస్తేనే హీరోయిన్స్‌కి ఇప్పుడు ఎక్కువగా క్రేజ్. అయితే ఇది అందరి విషయంలో కాకపోయినా కొందరి విషయంలో మాత్రం నిజమనుకోవాల్సిందే.
– ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ముకుంద సినిమాలోనూ డీసెంట్ రోల్ చేసింది. అయితే, ఈ రెండు సినిమాలు ప్లా్లప్‌గా మిగిలాయి. అదే సమయంలో బాలీవుడ్‌లో సినిమా వచ్చింది. అది చేసి డిజాస్టర్‌తోపాటు ప్లాప్ హీరోయిన్ పేరు తెచ్చుకుంది. అయినా హరీశ్ శంకర్ దువ్వాడ జగన్నాథం సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే బికినీ ధరించడమే కాదు, లిప్ లాక్ కూడా ఇచ్చింది. అక్కడి నుంచి పూజా రేంజ్ మారిపోయింది. ఎక్స్‌ఫోజింగ్, గ్లామర్ పరంగా ఎంత వీలైతే అంత చూపిస్తోంది. అలా బాగానే పాపులారిటీ తెచ్చుకొని పాన్ ఇండియా రేంజ్‌లో నిలదొక్కుకుంది.
– తాజాగా సీతారామం సినిమాతో హీరోయిన్‌గా పాపులర్ అయిన మృణాల్‌ఠాకూర్ కూడా బాలీవుడ్‌లో గ్లామర్ పాత్రలు చేసింది. సీతారామం సినిమాలో సీత పాత్రలో నటించి సౌత్‌లో ఒక్కసారిగా పాపులర్ అయిన మృణాల్ ఫొటో షూట్స్ విషయంలో మాత్రం అర్ధ భాగం ఒంటిమీద నూలుపోగు లేకుండా కనిపిస్తోంది.

– ఇటీవల కీర్తి సురేష్ కూడా తన స్కిన్‌షో ఫొటో షూట్స్ చూస్తే ఒక్కరికీ మైండ్ బ్లాకవుతోంది. అసలు కీర్తి నుంచి ఇలాంటి ఫొటోలు బయటకి వస్తాయని ఎవరూ ఊహించలేదు. తొడలు కనిపించేలా భుజాల కిదని టాప్ ఉండే కాస్ట్యూమ్స్ వేసుకొని కైపెక్కిస్తుంది. ఈ ఫొటోలలో చూడటానికే ఎక్కువగా జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. కీర్తి సురేష్ నాభి(బొడ్డు) చూడాలనే కోరిక కూడా సర్కారు వారి పాటలో తీర్చింది.
– కెరీర్ ప్రారంభంలో కెరీర్ ఎండింగ్‌లో అనుష్క లాంటి స్టార్ హీరోయిన్స్‌కూడా గ్లామర్ తారగా కనిపించిన వారే. నాభి అందాలతోపాటు కాస్త ఘాటు సన్నివేశాలలో కూడా నటించి తనలోని గ్లామర్ యాంగిల్‌ను చూపించింది. ఎందరో ఫాంలో ఉన్న హీరోయిన్స్ కూడా పొదుపుగా బట్టులు కట్టుకొని అందాల ఆరబోతతో హీటెక్కించినవారే.
– ఇటీవల ఉప్పెన సినిమాతో అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతిశెట్టి ఇప్పుడు ఫాం, క్రేజ్ కోసం తన ఒంటిమీద కాస్ట్యూమ్ సైజ్ తగ్గిస్తోంది. ఇలా అందరు దాదాపు ఇదే ఫాలో అవుతున్నారు. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, నిధి అగర్వాల్ లాంటి హాట్ భామల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది.. తరచూగా అందాలను చూపిస్తూనే ఉన్నారు.
వారికే ఫ్యాన్స్ ఎక్కువ..
ఇక సంప్రదాయంగా కనిపించే హీరోయిన్ల సినిమాలను సైతం చూస్తున్న యూత్, అభిమానులు తర్వాత వారిని మోడ్రన్‌గా చూడడానికి ఎదురు చూస్తున్నారు. ఉప్పెనలో కృతిశెట్టిని లంగావోణిలో చూసిన అభిమానులు తర్వాత గ్లామర్ రోల్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కీర్తి సురేశ్ విషయంలోనూ అభిమానులు ఇదే కోరుకున్నారు. మహేశ్‌బాబుతో తీసిన సినిమాలో కాస్త కోరిక తీరింది. సీతారామం హీరోయిన్ కూడా తెలుగు అభిమానులకు తెగ నచ్చేసింది. తర్వాత సినమాలో ఆమె ఎలా కనిపిస్తుందో, ఎవరితో జతకడుతుందో అని ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు.