Vijay Viral Video: ఈ నెల 23 న తమిళనాడు లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా , రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియబోతుండడం తో , వివిధ పార్టీలకు చెందిన అధినేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) ఈ ఎన్నికల్లో తన TVK పార్టీ ని పోటీ లోకి దింపబోతున్న సందర్భంగా, ఆయన చేస్తున్న ఎన్నికల ప్రచారం , ఆయన సభలకు , రోడ్ షోస్ కి వస్తున్న జనాలను చూసి ప్రత్యర్థి పార్టీలు వణికిపోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది ఇండియా కూటమినా?, లేకపోతే ఎన్డీయే కూటమినా ? అనేది నిర్ణయించబోయే స్థానం లో విజయ్ కూర్చున్నాడని సర్వేలు కూడా చెప్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన ఒక చర్చి లో మోకాళ్ళ మీద నడుస్తూ దేవుడికి దండం పెట్టుకున్న వీడియో సంచలనంగా మారింది.
దీనిపై సోషల్ మీడియా లో ట్రోల్స్ కూడా మామూలు రేంజ్ లో రావడం లేదు. ఎప్పుడైనా విజయ్ దేవుడికి ఇలా దండం పెట్టడం చూశారా ?, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఓట్ల కోసం ఆయన ఎన్ని వేషాలు వేస్తున్నాడో మీరే చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయ్ అభిమానులు దీనికి కౌంటర్ ఇస్తూ ‘విజయ్ తన జీవితాన్ని ప్రైవేట్ గా ఉంచేందుకే ఇన్ని రోజులు చూశాడు. మొదటి నుండి ఆయన ఇలాగే చేస్తూ ఉండొచ్చు, ఇప్పుడు ఆయన పబ్లిక్ జీవితం లోకి వచ్చాడు కాబట్టి, ఆయన చేసేవి మొత్తం మనకి కనిపిస్తున్నాయి , దీనిని కూడా విమర్శించే వాళ్లకు బుద్ధి లేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానుల సంగతి కాసేపు పక్కన పెడితే , సాధారణ జనాలకు ఇలాంటివి డ్రామాలు లాగానే అనిపిస్తాయి.
ఇక విజయ్ పార్టీ గురించి సర్వేలు చెప్తున్న మాట ఏమిటంటే , ఆయనకు 8 నుండి 12 శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి కొన్ని సర్వేలు అయితే 12 నుండి 16 శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి. కానీ విజయ్ కి మాత్రం తానూ పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో గెలవడం చాలా కష్టమని అంటున్నారు. పెరంబూర్ స్థానం లో గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కానీ, చాలా కష్టపడాల్సి ఉంటుందని , డబ్బులు మంచి నీళ్లు లాగా ఖర్చు చేయాల్సి ఉంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఏమి జరగబోతుందో తెలియాలంటే మే 4 న ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.
In all these years in Cinema industry, have you ever seen Vijay doing this?
Now for votes, he is stooping down to new levels. What a chamaeleon. pic.twitter.com/bnCkf3pCAx
— Trollywood (@TrollywoodX) April 19, 2026