Homeలైఫ్ స్టైల్Hyderabad Veg Restaurants: ఎన్ని రామేశ్వరం కేఫ్ లు వచ్చినా.. హైదరాబాదులో వీటిని అధిగమించలేదు.. అలాంటి...

Hyderabad Veg Restaurants: ఎన్ని రామేశ్వరం కేఫ్ లు వచ్చినా.. హైదరాబాదులో వీటిని అధిగమించలేదు.. అలాంటి రేంజ్ వీటిది

Hyderabad Veg Restaurants: పొగలు కక్కే సాంబార్ ఇడ్లీ.. నోటిలోకి మెత్తగా జారిపోయే జీడిపప్పు ఉప్మా
… నాలుకకు సరికొత్త రుచిని తగిలించే పెసరట్టు.. కళ్ళను నాలుగింతలు చేసుకొని చూసే 70 ఎం ఎం దోస.. ఇంకా ఇవేనా.. చాలా ఉన్నాయి.. మెనూ నిండుగా.. మనసు పసందుగా.. ఇక ఇక్కడి నేతి ఇడ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దూది పింజ లాగా ఉంటుంది. ముట్టుకుంటే నోట్లోకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది.

చాలామంది నాన్ వెజ్ వంటకాలు అంటే చాలా ఇష్టపడుతుంటారు. కానీ శాఖాహారంలో ఉన్న సంతృప్తి అందులో కనిపించదు. అందువల్లే హైదరాబాద్ నగరంలో శాకాహార ప్రియుల కోసం దాదాపు దశాబ్దాల క్రితం ప్రీమియం రేంజ్ లో రెండు హోటల్స్ ఏర్పాటు చేశారు. వాటి పేరు కామత్, ఇంకొకటి తాజ్ మహల్. ఇవి హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉంటాయి. శాకాహార గంటలకు ఈ రెండు హోటల్స్ పెట్టింది పేరు. ప్రారంభం నుంచి ఇప్పటివరకు తమ స్థాయిని పెంచుకుంటూనే పోతున్నాయి. ఏ ఒక్క కస్టమర్ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వలేదంటే.. ఇక్కడ లభించే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ధరలు సరసమైన స్థాయిలో ఉండవు. అలాగని జేబులకు చిల్లు పెట్టే విధంగా ఉండవు. ప్రీమియం రేంజ్ అని చెప్పాం కాబట్టి అదే స్థాయిలో ఉంటాయి.

ఈ హోటళ్లలో మధ్యాహ్నం లభించే మీల్స్ కు ప్రత్యేకమైన అభిమాన గణం ఉంటుంది. ఇక్కడ పెట్టే మీల్స్ లో కచ్చితంగా స్వీట్ ఉంటుంది.. చిట్టి పూరీలు అదనం. కూరల్లో ఫ్రై, పప్పు, సాంబార్, అప్పడం, ఇంకా కొన్ని రకాల పచ్చళ్ళు.. పొడులు ఉంటాయి.. మన అవసరం ఆధారంగా నెయ్యి సర్వ్ చేస్తుంటారు.

ఉదయం నుంచి మొదలుపెడితే రాత్రి వరకు ఈ హోటళ్ళు హౌస్ ఫుల్ గా కనిపిస్తుంటాయి. ఒకరోజు గిరాకీ తగ్గిందని కానీ.. పెరిగిందని గాని ఉండదు. స్థిరంగా సాగిపోతూ ఉంటుంది బిజినెస్. ఈ హోటళ్లలో కృత్రిమ తత్వం అసలు కనిపించదు. గ్లాసులలో నీరు ఇస్తారు. స్టీల్ ప్లేట్లలో సర్వ్ చేస్తుంటారు. పింగాణి కప్పులలో టీ, కాఫీ ఇస్తుంటారు. తినడం పూర్తయిన తర్వాత.. బిల్లులు కౌంటర్లో చెల్లించాలి..

ఈ హోటలలో తిన్నవారు తమ అనుభూతిని అసలు మర్చిపోరు. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్లు ఈ హోటల్స్ లో తినడం ఇష్టపడుతుంటారు. హైదరాబాద్ నగరానికి ఎన్ని రకాల రామేశ్వరం కేఫ్ లు వచ్చినా సరే వీటిని బీట్ చేయలేవు. ఇప్పటికే ఈ హోటల్ నిర్వాహకులు తమ తర్వాత తరాలను కూడా ఈ బిజినెస్ లోకి వచ్చేలా చేశారు. ఈ ప్రకారం చూసుకుంటే ఇంకా చాలా సంవత్సరాలు హైదరాబాద్ నగర ప్రజల ఆకలిని తీర్చుతాయి. పెయిడ్ ప్రమోషన్ జోలికి వెళ్లలేదు గాని.. ఒకవేళ అదే గనుక చేసి ఉంటే ఈ హోటళ్లకు సంబంధించిన రీల్స్, షార్ట్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular