ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్ విపత్తు అరికట్టే క్రమం లో తెలంగాణ ప్రభుత్వం మార్చ్ 31 వరకు థియేటర్ల మూసివేతకు తీసుకొన్న నిర్ణయానికి సంసిద్ధత ని వ్యక్తం చేస్తూ మార్చ్ 15 వ తారీఖున హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లోఉన్న ఫిలిం ఛాంబర్ లో టి ఎఫ్ సి సి సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశం లో మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ) , నిర్మాతల మండలి మరియు సినీ రంగం లోని ఉద్యోగుల సమాఖ్య యొక్క 24 శాఖల ప్రతినిధులు కలిసి మార్చ్ 21 వ తారీకు వరకు తమ తమ షూటింగ్ లను నిలిపి వేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది .
కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా టి ఎఫ్ సి సి మరియు నిర్మాతల మండలి ఈ షూటింగ్ నిలిపివేత కార్యక్రమము ఈ నెల 31 వ తారీకు వరకు పొడిగించాల్సిన అవసరం గుర్తించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది . తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాల సలహా మేరకు రెండు రాష్ట్రాల లోని అన్ని సినిమా థియేటర్ లు కూడా మార్చ్ నెలాఖరు వరకు నిరవధికంగా మూసివేయడం జరుగుతుంది . ఇక తదనంతర పరిణామాలను రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు తీసుకోవడం జరుగుతుంది ఆ విషయాలన్నీ ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుందని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ తాజాగా విధుల చేసిన తన ప్రకటనలో పేర్కొంది .
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Telugu film industry shut down till march 31st
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com