Telugu Film Industry: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో( Indian film industry) తెలుగు చిత్ర సీమ ది ప్రత్యేక స్థానం. దేశవ్యాప్తంగా ప్రాంతీయ సినీ పరిశ్రమలు ఉన్నా.. టాలీవుడ్ దూసుకెళ్తోంది. ప్రతిభ కలిగిన దర్శకులు, నటులు ఇందుకు కారణం. అటువంటి పరిశ్రమ స్వతంత్రంగా ఎదుగుతూ వస్తోంది. కానీ ఇటీవల రాజకీయ పెత్తనం ఎక్కువైంది. రాజకీయ పెత్తనం సాగించే వారికి సరెండర్ అవుతోంది చిత్ర పరిశ్రమ. ఉద్యమ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమను విపరీతంగా ద్వేషించారు కేసీఆర్. అదే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమ ఆయనకు అనుకూలంగా మారింది. అదే సమయంలో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం చిత్ర పరిశ్రమ విషయంలో అలానే పెత్తనం చేయాలని చూసింది.
* మితిమీరిన రాజకీయ జోక్యం..
అయితే ఇందులో చిత్రం ఏమిటంటే రాజకీయ పెత్తనం చేసే ప్రభుత్వాలకు సలాం చేస్తున్నారు సినీ పరిశ్రమ పెద్దలు. ఏపీలో( Andhra Pradesh) టికెట్ల ధరలు, బెన్ఫిట్ షోలకు అనుమతులు, ఆపై థియేటర్లలో వసతులు వంటి విషయాల్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ పెత్తనం ప్రదర్శించింది. దీంతో సినీ ప్రముఖులు తాడేపల్లి వైసీపీ ప్యాలెస్ ముందు చేతులు కట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పట్ల విపరీతమైన అభిమానాన్ని చూపుతోంది చిత్ర పరిశ్రమ. కానీ అదే చిత్ర పరిశ్రమకు చెందిన పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. కానీ ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం విషయంలో మాత్రం చిత్ర పరిశ్రమ భిన్న వైఖరితో ఉంది.
* తెలంగాణకు సొంతమా?
తెలుగు చిత్ర పరిశ్రమ( Telugu cinema industry) అంటేనే తెలంగాణకు సొంతం అన్నట్టు పరిస్థితి మారింది. రాష్ట్ర విభజన జరిగి పుష్కరకాలం అవుతోంది. కానీ తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీ వైపు తొంగి చూడడం లేదు. కేవలం అవుట్డోర్ షూటింగులు మాత్రమే ఏపీలో జరుగుతున్నాయి. అలాగని అందమైన లోకేషన్లు లేవా? అంటే మాత్రం ఉన్నాయనే సమాధానం వస్తుంది. విశాఖ సినీ పరిశ్రమ అభివృద్ధికి అనువైన ప్రాంతమే. అయినా సరే ఉదాసీనత కొనసాగుతోంది. రాజకీయ కర్ర పెత్తనం చేసే ప్రభుత్వాల విషయాల్లో చిత్ర పరిశ్రమ ఒకలా ఉంది. కానీ స్వతంత్రంగా ఎదిగేందుకు ప్రోత్సహించిన ప్రభుత్వాల విషయంలో మాత్రం ఒకల ప్రవర్తిస్తున్నారు సినీ పరిశ్రమ పెద్దలు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ఏపీలో కూడా విస్తరించే ప్రయత్నాలు జరగాలి. అప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమపై కర్ర పెత్తనం పోతుంది. ఈ విషయంలో మాత్రం సినీ పెద్దలు చొరవ చూపకపోతే.. తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నడూ రాజకీయ చట్రంలో ఉండి పోవాల్సిందే.