spot_img
Homeఎంటర్టైన్మెంట్Divya Bharati Biopic: దివ్యభారతిగా తమన్నా... సంచలన బయోపిక్ తో ఆ మిస్టరీ వీడేనా?

Divya Bharati Biopic: దివ్యభారతిగా తమన్నా… సంచలన బయోపిక్ తో ఆ మిస్టరీ వీడేనా?

Divya Bharati Biopic: ప్రస్తుతం బయోపిక్స్ హవా బాగా నడుస్తోంది. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కావచ్చు,మరే ఇతర రంగాల్లో అయిన కావచ్చు, అందులోని వ్యక్తల జీవితాల్లో ఆసక్తి కలిగించే చిన్న అంశం ఉన్న కాని వాటిని బేస్ చేసుకొని బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. గతంలో చాలా మంది సెలబ్రిటీస్ ఆటో బయోగ్రఫీ అంటూ తమ గురించి ఒక బుక్ రాయడం లేదా వేరేవాళ్లతో రాయించటం చేసేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి బయోపిక్స్ రూపంలో అవి బయటకు వస్తున్నాయి.

ఒకప్పుడు తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకులను కూడా ఒక ఊపేసిన హీరోయిన్ దివ్య భారతి. కేవలం మూడే మూడు ఏళ్ల లో దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి సుమారు 20 సినిమాలు దాక నటించి మెప్పించింది. అటు అందంలోనూ , ఇటు అభినయంలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అప్పటి స్టార్ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పటి ప్రేక్షకులకు దివ్య భారతి గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ 90స్ ప్రేక్షకులకు దివ్య భారతి ఒక ఎమోషన్ అనే చెప్పాలి.

నార్త్ నుండి వచ్చిన కానీ ఆమెను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకొని స్టార్ హీరోయిన్ స్టేటస్ కట్టబెట్టారు. ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. అలాంటి ఆమె అనుకోని రీతిలో అతి చిన్న వయస్సులోనే చనిపోయింది. ఇప్పటికి ఆమె మృతిపై అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. చిన్న వయస్సులోనే స్టార్ హీరోయిన్ కావడం , అనుకోని స్థితిలో చనిపోవడంతో పాటు ఆమె జీవితంలో మరెన్నో మిస్టరీలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు వాటిని తెరమీదకు తీసుకొచ్చే ఆలోచనలు జరుగుతున్నాయి.

మలయాళం కు చెందిన ఒక దర్శకుడు సినిమా కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా దివ్య భారతి రోల్ కోసం తమన్నా ను కలిసినట్లు సమాచారం. స్టోరీ కూడా నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు కొంచెం తగ్గిన మాట వాస్తవమే. రీసెంట్ గా భోళా శంకర్ సినిమాలో నటించిన కానీ ఆమెకు సక్సెస్ దక్కలేదు. మరోపక్క వెబ్ సిరీస్ లో నటిస్తూ, బోల్డ్ పాత్రలకు కూడా ఒకే చెబుతుంది ఈ చిన్నది. ఇలాంటి టైం లో బయోపిక్ అవకాశం రావడంతో తమన్నా దానికి ఎస్ చెప్పినట్లు తెలుస్తుంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper