spot_img
Homeఎంటర్టైన్మెంట్Samantha- Anchor Suma: పెళ్లిలో అండర్ స్టాండింగ్ ఉండాలి అన్న సుమ.. సైలెంట్ గా ఉండిపోయిన...

Samantha- Anchor Suma: పెళ్లిలో అండర్ స్టాండింగ్ ఉండాలి అన్న సుమ.. సైలెంట్ గా ఉండిపోయిన సమంత..

Samantha- Anchor Suma: ఏం మాయ చేసావే సినిమాతో మన అందరిని మాయ చేసిన సమంత.. ఆ తరువాత ఆ సినిమా హీరో, అక్కినేని వారసుడైన నాగచైతన్య అని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అనుకోని కారణాల వల్ల వారిద్దరూ పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే విడిపోయారు. ఇక వీరు వీడిపోయి రెండు సంవత్సరం పైనే కావస్తున్న సమంత తన పెళ్లి, విడాకుల మీద ఇప్పుడు ఎక్కువగా స్పందించడం లేదు.

కొన్ని ఇంటర్వ్యూలలో ఇన్ డైరెక్ట్ గా కొన్ని విషయాలు చెప్పుకొచ్చిన.. అసలు సమంత.. నాగచైతన్య తో విడిపోవడానికి కారణం మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. ఈ నేపథ్యంలో త్వరలో విడుదల కానున్న సమంత విజయ దేవరకొండ సినిమా ఖుషి ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఒకటి రిలీజ్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సమంత కాస్త నవ్వుతూనే సరదాగా కనిపించింది. కానీ పెళ్లి టాపిక్ వచ్చే సరికి మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయింది.

ఈ ఇంటర్వ్యూలో సమంతతో పాటు సుమ, రాజీవ్ కనకాల, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ ముగ్గురు పెళ్లి గురించి తమ తమ అభిప్రాయాలను కొంచెం సీరియస్ గా.. కొంచెం జోక్ గా చెబుతూ పోగా సమంత మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది.

అసలు ఈ సందర్భం ఎందుకు వచ్చింది అంటే ఇంటర్వ్యూలో యాంకర్ సుమ మీ జీవితాల్లో ఖుషి ఏంటి అని అక్కడ ఉన్న వారిని అడగగా,‌ విజయ్ తన లైఫ్‌లో ఖుషి అంటే.. తన ఫ్యామిలీ, మ్యారేజ్ అంటూ చెప్పుకుంటూ పోయాడు. ఇక అప్పుడు అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరూ కూడా పెళ్లి ఎందుకు? ఇప్పుడు సంతోషంగానే ఉన్నావ్ కదా? పెళ్లి చేసుకోవడం నీకు అవసరమా? అన్నట్టుగా సలహాలు ఇస్తూనే ఉన్నారు.

ముఖ్యంగా సుమా భర్త రాజీవ్ కనకాల విజయ్ మాట్లాడుతూ ఉండగా అలా విజయ్ మాట్లాడుతూ ఉంటే.. మధ్యలో రాజీవ్ కనకాల పెళ్లి కొంతకాలమే బాగుంటుందని కౌంటర్లు వేశాడు. ఇక వెంటనే సుమ అందుకొని. ఏం పర్లేదు విజయ్.. పెళ్లి చేసుకోమనే నేను సలహా ఇస్తాను.. నువ్వొక్కడివే ఎందుకు సంతోషంగా ఉండాలి అంటూ పంచ్ వేసింది. ఇలా అందరూ ఏదో ఒక కౌంటర్ వేస్తుంటే సమంత మాత్రం ఏం మాట్లాడుకుండా అలా సైలెంట్ గా ఉండిపోయింది.

ఇక జోక్స్ అన్నీ అయిపోయాక ఫైనల్ గా విజయ్ దేవరకొండ..పెళ్లి అయితే ఓ సారి ట్రై చేస్తాను అని అనగా.. దానికి సమాధానం గా సమంత ఏంటి? ట్రై చేస్తావా? అని నవ్వేసింది. పెళ్లిలో ట్రైలు గైలు ఉండవు.. చేసుకోవడమే అని సుమ సెటైర్ వేసింది. హిట్టు ఫ్లాపులు అయినా ముందుకు వెళ్లాల్సిందే.. అండర్ స్టాండింగ్ ఉండాలి.. మిస్ అండర్ స్టాండింగ్ అయినా కూడా దాన్ని అండర్ స్టాండింగ్ చేసుకోగలగాలి అంటూ పెళ్లి బంధం మీద సుమ చెప్పుకుంటూపోయింది. కానీ సమంత మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా కామ్ గా ఉండిపోయింది.

ఆ తర్వాత సమంతకు ఖుషి అంటే ఏంటి? అని సుమ అడిగగా..ఇప్పుడు ఆల్రెడీ కొత్త ఖుషి టైం స్టార్ట్ అయిందని, తనకు తాను టైం కేటాయించుకుంటున్నాను, తన గురించి తాను ఆలోచించుకుంటున్నాను అని సమంత చెప్పింది. అదే తన ఖుషి అని తెలిపింది సమంత.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper