Bedurulanka 2012 Collections: కార్తికేయకు ఎట్టకేలకు హిట్ పడినట్లే. ఆయన లేటెస్ట్ మూవీ బెదురులంక 2012 క్లీన్ హిట్ దిశగా అడుగులు వేస్తుంది. నిర్మాతలకు కాసులు కురిపిస్తుంది. ఆగస్టు 25న బెదురులంక విడుదలైంది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఓ మోస్తరు ఓపెనింగ్ డే వసూళ్లు దక్కాయి. అయితే మౌత్ టాక్ తో మూవీ పుంజుకుంది. ఫస్ట్ డే వసూళ్ల కంటే సెకండ్ డే… సెకండే డే వసూళ్లకు మించి థర్డ్ డే వసూళ్లు ఉన్నాయి. వీకెండ్ ముగిసే నాటికి బెదురులంక బ్రేక్ ఈవెన్ కి దగ్గరైంది.
ఓపెనింగ్ డే ఏపీ/తెలంగాణాలలో బెదురులంక రూ . 1.36 కోట్ల గ్రాస్ రాబట్టింది. సెకండ్ డే రూ. 1.50 కోట్లు, థర్డ్ డే రూ. 1.95 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఇక మూడు రోజులకు గానూ కర్ణాటక, రెస్టాప్ ఇండియా, ఓవర్సీస్ కలిపి రూ. 1.53 గ్రాస్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ బెదురులంక 3డేస్ వసూళ్లు రూ. 6.34 కోట్ల గ్రాస్, రూ. 3.68 కోట్ల షేర్ గా ఉంది. బెదురులంక చిత్రానికి ఎక్స్ట్రా షోస్, థియేటర్స్ పడుతున్నాయి.
బెదురులంక వరల్డ్ వైడ్ బిజినెస్ రూ. 4.10 కోట్లని సమాచారం. అంటే రూ. 4.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బెదురులంక బరిలో దిగింది. కాబట్టి మరో రూ. 82 లక్షలు వసూలు చేస్తే బెదురులంక క్లీన్ హిట్ అవుతుంది. ఈ చిత్రంతో పాటు విడుదలైన గాండీవధారి అర్జున పూర్తిగా నెమ్మదించింది. ఆడియన్స్ ఛాయిస్ బెదురులంక మాత్రమే. కాబట్టి సోమవారం బెదురులంక బ్రేక్ ఈవెన్ కానుంది. నెక్స్ట్ వీక్ వరకు బెదురులంక బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది.
బెదురులంక చిత్రానికి దర్శకుడు క్లాక్స్. యుగాంతం అనే ఓ క్రేజీ పాయింట్ చుట్టూ కామెడీ రొమాంటిక్ డ్రామా అల్లాడు. కార్తికేయకు జంటగా డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి నటించింది. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యర్, కసి రెడ్డి, ఆటో రామ్ ప్రసాద్ కామెడీ సినిమాకు హైలెట్ గా నిలిచింది. మొత్తంగా చాలా కాలం తర్వాత కార్తికేయకు హిట్ పడింది. ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఆడియన్స్ కి ధన్యవాదాలు చెబుతున్నారు.