Sreemukhi: పర్పుల్ కలర్ ఫ్రాక్, టాప్ లో మెరుపులా ఆకర్షించింది యాంకర్ శ్రీముఖి. మెడలో డైమండ్ నెక్లెస్ తో మైమరిపించింది. శ్రీముఖి క్లీవేజ్ షో కాకరేపగా ఫ్యాన్స్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. నీతోనే డాన్స్ లేటెస్ట్ ఎపిసోడ్ కోసం శ్రీముఖి ఇలా సిద్ధమయ్యారు. నీతోనే డాన్స్ షో చివరి దశకు చేరుకుంది. ఫైనల్ కూడా ముగిసింది. నీతోనే డాన్స్ గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా విజయ్ దేవరకొండ వచ్చినట్లు సమాచారం. ఆయన విజేతలకు బహుమతులు అందించనున్నారు. నీతోనే డాన్స్ షోలో బుల్లితెర సెలెబ్రిటీలు పార్టిసిపేట్ చేశారు. ఫినాలే ప్రసారం కావాల్సి ఉంది.
హీరోయిన్స్ సదా, రాధలతో పాటు తరుణ్ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో శ్రీముఖి గ్లామర్ హైలెట్ అవుతుంది. ప్రస్తుతం తెలుగులో శ్రీముఖి టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది. షోస్ పరంగా చూస్తే ఆమెనే నెంబర్ వన్. సుమ జోరు కొనసాగుతున్నా శ్రీముఖి తనదైన మార్గంలో దూసుకుపోతుంది. ఈ మధ్య సుమ ఎక్కవగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నారు. సుమ అడ్డాతో పాటు అమ్మా ఆవకాయ్ పేరుతో మరో షో చేస్తుంది. శ్రీముఖి నాలుగైదు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల శ్రీముఖి భోళా శంకర్ మూవీలో నటించారు. మెగాస్టార్ చిరంజీవితో ఆమె కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించారు. ఖుషి మూవీలోని నడుము చూసే సన్నివేశం శ్రీముఖి, చిరంజీవి స్పూఫ్ చేశారు. భోళా శంకర్ ఫెయిల్ కావడంతో శ్రీముఖి, చిరంజీవి సన్నివేశాలు ట్రోల్ కి గురయ్యాయి. శ్రీముఖి సినిమాకు ప్లస్ అవుతుంది అనుకుంటే మైనస్ అయ్యింది.
ఇక ప్రక్క స్టార్ యాంకర్ గా రాణిస్తూనే నటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తుంది. ఆమెకు హీరోయిన్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అయితే ఆచితూచి అడుగులు వేస్తున్నారట. చిన్నా చితకా దర్శకులు, నిర్మాతలతో చిత్రాలు చేయడం వలన ప్రయోజనం ఉండదు. పేరున్న టీమ్ తో పని చేసి సక్సెస్ కొట్టి హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని చూస్తుందట. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి ఆల్రెడీ హీరోయిన్ గా చేసింది. మరోవైపు శ్రీముఖి పెళ్లి రూమర్స్ వినిపిస్తున్నాయి. వీటిని శ్రీముఖి కొట్టిపారేశారు.
View this post on Instagram