Homeఎంటర్టైన్మెంట్Sreeleela Crying: ట్రోలింగ్ భరించలేక ఏడ్చేసిన హీరోయిన్ శ్రీలీల..సంచలనం రేపుతున్న వీడియో!

Sreeleela Crying: ట్రోలింగ్ భరించలేక ఏడ్చేసిన హీరోయిన్ శ్రీలీల..సంచలనం రేపుతున్న వీడియో!

Sreeleela Crying: సినీ ఇండస్ట్రీ లో సక్సెస్ ఉంటేనే ఎంత పెద్ద సూపర్ స్టార్ కి అయినా విలువ ఉంటుంది. వరుసగా ఫ్లాప్స్ వస్తే ఎంత పెద్ద సూపర్ స్టార్ కి అయినా పేరు పోతుంది. చిరంజీవి , రజినీకాంత్ వంటి దిగ్గజాలే ఇలాంటి ఫేస్ ని చూడాల్సి వచ్చింది, ఇక నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఫేమ్ ని సంపాదించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. పైగా పాత తరం జనరేషన్ […]

Sreeleela Crying: సినీ ఇండస్ట్రీ లో సక్సెస్ ఉంటేనే ఎంత పెద్ద సూపర్ స్టార్ కి అయినా విలువ ఉంటుంది. వరుసగా ఫ్లాప్స్ వస్తే ఎంత పెద్ద సూపర్ స్టార్ కి అయినా పేరు పోతుంది. చిరంజీవి , రజినీకాంత్ వంటి దిగ్గజాలే ఇలాంటి ఫేస్ ని చూడాల్సి వచ్చింది, ఇక నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఫేమ్ ని సంపాదించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. పైగా పాత తరం జనరేషన్ కి చెందిన సెలబ్రిటీలకు కాస్త బెటర్ పరిస్థితులు ఉండేవి. ఎందుకంటే అప్పట్లో సోషల్ మీడియా ఉండేది కానీ , జనాలు చేసే విమర్శలు వాళ్ళ వరకు చేరే పరిస్థితులు లేవు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితిలు లేవు, సోషల్ మీడియా బాగా వృద్ధిలోకి వచ్చిన తర్వాత నెటిజెన్స్ సినీ సెలబ్రిటీలను ట్యాగ్ చేసి బూతులు తిట్టడం , వెక్కిరించడం వంటివి సర్వ సాధారణం అయిపోయింది.

ఈమధ్య కాలంలో సూపర్ స్టార్స్ కి చెందిన అభిమానులు కూడా సినిమాలు బాగాలేకపోతే నేరుగా తమ సొంత హీరోలని ట్యాగ్ చేసి తిడుతున్నారు. కొంతమంది వీటిని పెద్దగా పట్టించుకోరు , కానీ కొంతమంది మాత్రం చాలా సీరియస్ గా తీసుకొని బాధపడిపోతుంటారు. అలాంటి వారిలో హీరోయిన్ శ్రీలీల ఒకరు. ఈమె కెరీర్ మొత్తం మీద రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు తప్ప , మరో హిట్ లేదు. ఈ కారణం చేత శ్రీలీల పై సోషల్ మీడియా లో వచ్చిన ట్రోల్స్ అన్నీ ఇన్ని కావు. ఆమెని ఐరన్ లెగ్ అని పిలవడం, నటన రాదంటూ వెక్కిరించడం వంటివి చాలానే చేస్తున్నారు నెటిజెన్స్. వీటిని చూసి హీరోయిన్ శ్రీలీలే చాలా బాధపడేది అట. అనేక సందర్భాల్లో ఏడ్చేది అట. ఈ విషయాన్నీ రీసెంట్ గా ఈమె ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో వచ్చే ట్రోల్స్ ని చూసి ఏడ్చేసేదానిని. నా వల్ల కాదు అమ్మ, సినిమాలు మానేసి మళ్లీ చదువుకోమంటావా అని మా అమ్మ ని అడిగేదానిని. కానీ కెరీర్ ప్రారంభం లో ఉన్న భయం , బెరుకు ఇప్పుడు లేదు. ఇప్పుడు ట్రోల్స్ ని పట్టించుకోవడం మానేసాను’ అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అయితే ఆమె ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం పై చాలా ఆశలే పెట్టుకుంది. కానీ ఈ సినిమా కూడా కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో ఇప్పుడు మన టాలీవుడ్ లో శ్రీలీల కెరీర్ డైలమాలో పడింది.

 

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper