Homeఎంటర్టైన్మెంట్Sreeleela Career: తెలుగులో శ్రీలీల కెరీర్ ఇక ముగిసినట్టే.. చివరికి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేకపోయాడు!

Sreeleela Career: తెలుగులో శ్రీలీల కెరీర్ ఇక ముగిసినట్టే.. చివరికి పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేకపోయాడు!

Sreeleela Career: కరోనా లాక్ డౌన్ సమయం లో మన ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. వారిలో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని, రెండవ సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ కి చేరుకున్న నటి శ్రీలీల(Sreeleela). ‘పెళ్లి సందడి’ చిత్రం తో మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైన ఈమె, ఆ తర్వాత ‘ధమాకా’ చిత్రం తో భారీ కమర్షియల్ హిట్ ని అందుకుంది. ఇక ఆ తర్వాత అదే ఈమె కెరీర్ లో చివరి బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. మధ్యలో ‘భగవంత్ కేసరి’ అనే సినిమా కూడా ఉంది కానీ, అది పూర్తి స్థాయి కమర్షియల్ హిట్ కాదు, ఎబోవ్ యావరేజ్ రేంజ్ అనుకోవచ్చు. ఇలా వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటున్న శ్రీలీల కి తెలుగు లో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు ఆమెకు తమిళం లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?

కానీ అక్కడ కూడా ఈమెకు డిజాస్టర్ ఫ్లాప్స్ తప్పలేదు. ఆమె హీరోయిన్ గా నటించిన ‘పరాశక్తి’ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే తెలుగులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఉంది కదా, ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయితే మళ్లీ శ్రీలీల జోరు టాలీవుడ్ లో గొప్పగా సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు. రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ వైపు అడుగులు తీస్తోంది. ఈ చిత్రం ‘హరి హర వీరమల్లు’ తో పోలిస్తే చాలా బెటర్ గా ఉంది, అయినప్పటికీ ఇంత పెద్ద ఫ్లాప్ అవ్వడానికి కారణం శ్రీలీల ఐరన్ లెగ్ అని అంటున్నారు సోషల్ మీడియా లో అభిమానులు. అప్పట్లో శృతి హాసన్ ని కూడా ఇలాగే అందరూ ఐరన్ లెగ్ అని పిలిచేవాళ్ళు. కానీ ‘గబ్బర్ సింగ్’ తర్వాత గోల్డెన్ లెగ్ లాగా మారిపోయింది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయం లో శ్రీలీల కి కూడా అదే రిపీట్ అవుతుందని అనుకున్నారు కానీ, ఈమె దురదృష్టాన్ని పవన్ కళ్యాణ్ కూడా మార్చలేకపోయాడు. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. రీసెంట్ గానే తమిళం లో ధనుష్ హీరో గా తెరకెక్కుతున్న ఒక చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంది. కానీ మెయిన్ హీరోయిన్ గా మాత్రం కాదు, సాయి పల్లవి ఇందులో మెయిన్ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ చేస్తోంది. శ్రీలీల సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కాకుండా, బాలీవుడ్ లో రెండు చిత్రాల్లో నటించింది శ్రీలీల . ఇవి విడుదలకు రెడీ గా ఉన్నాయి, ఈ సినిమాల ఫలితాల ఆధారమగానే శ్రీలీల కెరీర్ ఆధారపడుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Oktelugu Epaper