Homeఎంటర్టైన్మెంట్Sandeep Reddy Vanga: స్పిరిట్ షూటింగ్ టైమ్ లో రవితేజ కొడుకు మీద సందీప్ వంగ...

Sandeep Reddy Vanga: స్పిరిట్ షూటింగ్ టైమ్ లో రవితేజ కొడుకు మీద సందీప్ వంగ సీరియస్ అయ్యాడా..? కారణమేంటంటే…

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డివంగా… ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి ఆయన సంపాదించుకున్న పాపులారిటి మాత్రం చాలా ఎక్కువనే చెప్పాలి. ఆయనకున్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పుడు చాలామంది హీరోలు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగా ఈ సినిమా ఏ […]

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డివంగా… ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి ఆయన సంపాదించుకున్న పాపులారిటి మాత్రం చాలా ఎక్కువనే చెప్పాలి. ఆయనకున్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పుడు చాలామంది హీరోలు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబడుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇప్పటివరకు వీళ్ళు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి.

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న చాలా మంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. ప్రభాస్ ఇలాంటి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తానని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట.

ఇక ఇదిలా ఉంటే స్పిరిట్ సినిమాకి సందీప్ రెడ్డి వంగ దగ్గర రవితేజ కొడుకు మహాధన్ భూపతి రాజు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా జరిగిన షెడ్యూల్లో మహధన్ భూపతి రాజు మీద ఫైర్ అయ్యాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ మహధన్ ఒక్కడి మీదనే అరవలేదట. టీమ్ లో ఉన్న కొంతమంది చేసిన కొన్ని తప్పుల వల్ల చిన్న డిస్టబెన్సేస్ వచ్చాయట. దానివల్ల సందీప్ రెడ్డివంగా డైరెక్షన్ టీమ్ లో ఉన్న అందరి మీద అరిచాడట.

ఇక అందులో త్రివిక్రమ్ కొడుకు రవితేజ కొడుకు కూడా ఉన్నారట. ఇక ఏది ఏమైనా కూడా దర్శకుడు అనేవాడు తనకు అనుకూలంగా వర్క్ చేయకపోతే ఎవరి మీద అయిన అరుస్తాడు. ఎందుకంటే అది కోట్లలో జరిగే వ్యాపారం అలాగే క్రియేటివిటీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా చాలా వరకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇది సినిమా రిజల్ట్ మీద కూడా ప్రభావాన్ని చూపించే ప్రమాదమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper