అలనాటి అందాల హీరో శోభన్‌బాబు మరణవార్త విని యావత్తు తెలుగు లోకం షాకైంది. కారణం శోభన్‌బాబు ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, ఎలాంటి దురలవాట్లు లేని వ్యక్తి. ఆరోగ్యం పై అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న వ్యక్తి. శోభన్ బాబు జీవితంలో సిగరెట్, మద్యం లాంటివాటికి ఎప్పుడూ దూరంగానే ఉన్నారు. అలాగే తినే తిండి విషయంలో కూడా ఆయన పర్ఫెక్ట్ గా ఉండేవారు.
మరి అలాంటి వ్యక్తి హఠాత్తుగా ఎలా చనిపోయారు ? నిజానికి శోభన్ బాబుగారు ఎప్పుడూ హాస్పిటల్ కి వెళ్లలేదట. ఇది నిజమేనా ? అని అందరికీ అనుమానం కలగొచ్చు గానీ, నిజంగానే శోభన్ బాబుకు ఎన్నడూ హాస్పిటల్ కి పోయే పరిస్థితే రాలేదు. వయసు 70 దాటినా ఆయన ఎంతో ఆరోగ్యంగా కనిపించేవారు. అయితే శోభన్ బాబు అల్లుడు అపోలో ఆస్పత్రిలో ప్రముఖ డాక్టర్‌గా పనిచేస్తున్నారు.
అందుకే, కుటుంబ సభ్యులు ఒకసారి వెళ్లి టెస్టులు చేయించుకుంటే మంచింది అని ఒత్తిడి తెచ్చినా.. శోభన్ బాబుగారు వినలేదు. ‘‘ఛత్.. నాకు టెస్టులు ఏమిటి ? మా తాత 107 ఏళ్లు బతికారు. మా నాన్న వందేళ్లు బతికారు. నేనూ అంతే.. వందేళ్లు పైనే బతుకుతాను అంటూ నవ్వుతూ చెప్పేవారట. అయితే శోభన్ బాబుగారి ఫ్యామిలీ మెంబర్ చెప్పినదాన్ని బట్టి, ఆయనకు ఇంజక్షన్ అంటే భయం అట.
ఇదే విషయాన్ని శోభన్ బాబు వెటకారంగా చెబుతూ ఈ ఇంజక్షన్ లేని హాస్పిటల్ ఉంటే చెప్పండి, ఆ హాస్పిటల్ కి వెళ్తాను అంటూ నవ్వేవారట. కానీ శోభన్ బాబు అన్నీ ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఉండేవారు. అందుకే శోభన్‌బాబుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇక ఆయన జీవితంలో బాధలూ, చికాకులు అసెలే లేవు. ఎంతో గొప్ప ప్రశాంతమైన జీవితం. అలాంటి వ్యక్తి 71వ ఏట హఠాత్తుగా మరణించడం బాదరకరమైన విషయం.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Sobhan babu have a injection fear
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com