Actress Sireesha: బుల్లితెర సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు శిరీష. ‘మొగలిరేకులు’ సీరియల్ తో మొదలైన ఈమె ప్రస్థానం, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించిన ఈమె, ఇప్పుడు లేడీ విలన్ గా ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈటీవీ లో ప్రసారమయ్యే ‘బొమ్మరిల్లు’ అనే సీరియల్ తో పాటు, జీ తెలుగులో ‘కలవారి కోడలు కనక మహాలక్ష్మి’,జెమినీ టీవీ లో ‘మా ఇంటి దేవత’ వంటి సీరియల్స్ లో లేడీ విలన్ గా నటిస్తోంది. అంతకు ముందు స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన పాపులర్ సీరియల్ ‘వంటలక్క’ లో కూడా ఈమె విలన్ గా నటించింది. ఇలా వరుసగా విలన్ క్యారెక్టర్స్ చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్న శిరీష సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వస్తోంది.
ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఈమె అప్లోడ్ చేసే హాట్ ఫోటోలు , వీడియోలకు కుర్రాళ్ళు మెంటలెక్కిపోతుంటారు. నేడు ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. మహేంద్ర బొర్రా అనే సీరియల్ ఆర్టిస్ట్ ని పెళ్లాడిన ఈమె, అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసుకుంది. మహేంద్ర గతం లో యాంకర్ గా, ఆర్జే గా పనిచేసేవాడు. ఆ తర్వాత స్టార్ మా ఛానల్ లో ‘ఇంటింటి రామాయణం’,’మగువ ఓ మగువ’ వంటి సీరియల్స్ లో నటించాడు. వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు ఒక్క సీరియల్ లో కూడా పని చెయ్యలేదు కానీ, అకస్మాత్తుగా ఇలాంటి ట్విస్ట్ ఇవ్వడం తో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. మరి వీళ్ళ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది?, ప్రేమ ఎలా పుట్టింది వంటివి తెలియాలంటే కొంతకాలం ఎదురు చూడక తప్పదు.
ఇకపోతే గతం లో శిరీష నవీన్ వల్లభనేని అనే అతన్ని పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరు కలిసి పలు టీవీ షోస్ లో కూడా కనిపించారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ , 2024 వ సంవత్సరం లో వీళ్లిద్దరు అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి ఒంటరిగానే తన కొడుకు తో కలిసి జీవిస్తున్న శిరీష, ఎట్టకేలకు ఇప్పుడు రెండవ పెళ్లి చేసుకుంది. కనీసం ఇతనితో అయినా సంతోషం గా జీవించాలని కోరుకుంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే వీళ్ళ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు కొన్ని ఇప్పుడు మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
View this post on Instagram