Silk Smitha
Silk Smitha : ఏలూరు సమీపంలో గల ఒక చిన్న పల్లెటూరిలో పుట్టిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. అతి పేద కుటుంబంలో పుట్టిన సిల్క్ స్మిత సినిమాలలో నటించాలని చెన్నై పారిపోయారని సమాచారం. పెద్దగా చదువు లేకపోయినా, తమిళం తెలియకపోయినా నేర్చుకుని సిల్వర్ స్క్రీన్ పై రాణించింది. 80-90లలో సిల్క్ స్మిత ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేసింది. శృంగార తారగా ఆమెకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తక్కువ సమయంలో సిల్క్ స్మిత 400 పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఎక్కువ నటించారు. హిందీలో సైతం సిల్క్ స్మిత సినిమాలు చేసింది.
Also Read : నోట్ల కట్టల మీద పడుకున్న హీరోయిన్, మరణం మాత్రం అనాథలా… దేశాన్ని ఊపేసిన తెలుగు అమ్మాయి!
సిల్క్ స్మితను ఉద్దేశించి గతంలో స్టార్ కమెడియన్ బాబు మోహన్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సిల్క్ స్మితను ఆయన బాస్ అని పిలిచేవాడట. సిల్క్ స్మిత సెట్ లో నల్ల కళ్ళజోడు పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని కూర్చునేదట. హీరోలు వచ్చినా లేచేది కాదట. వాళ్ళ ముందు కూడా ఆమె అలానే కూర్చునేదట. అలా ఎందుకు చేస్తావ్ బాస్ అని సిల్క్ స్మితను బాబు మోహన్ అడిగాడట. నన్ను మగాళ్లు ఎలా చూస్తారో తెలుసుకోవడానికి, అని సమాధానం చెప్పిందట.
ఒకరోజు సిల్క్ స్మిత ఇంటికి వెళ్ళాడట. ఆ ఇల్లు చూసి బాబు మోహన్ మైండ్ బ్లాక్ అయ్యిందట. ఇంద్ర భవనంలా తలపించిన ఇంటిని చూసిన బాబు మోహన్.. సిల్క్ స్మిత వలె వేల కోట్లు ఉన్నవాళ్లు కూడా బ్రతకలేరని, అన్నారు. అంత లగ్జరీ లైఫ్ ఆమె అనుభవించింది. షూటింగ్ లో వాడిన కాస్ట్యూమ్స్ ని అపురూపంగా దాచుకునేదట. సిల్క్ స్మిత తన అభిమానులను శోక సముద్రంలో ముంచుతూ 1996లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఆమె ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది. తనను మోసం చేసిన వాళ్ళ పేర్లను ఆ లేఖలో రాసింది. సిల్క్ స్మిత అంత్యక్రియలు నిరాడంబరంగా, అయినవాళ్లు లేకుండా జరిగాయి. ఒకరిద్దరు పరిశ్రమకు చెందిన ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.
Also Read : సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడానికి రజినీకాంత్ కూడా ఒక కారణమేనా..? ఆశ్చర్యపరుస్తున్న సంచలన నిజాలు!
Web Title: Silk smitha pushparaj attitude life
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com